ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పరీక్షలలో మరింత ఎదుగుతున్న భారత్

రెండు రోజులుగా రోజుకు 11.70 లక్షల శాంపిల్స్ కు పైగా పరీక్షలు

పరీక్షలు పెరుగుతునా, అదుపులోనే పాజిటివ్ కేసులు

పరీక్షలలో రోజువారీ పాజిటివ్ కేసులు 7.5% లోపే

Posted On: 04 SEP 2020 12:08PM by PIB Hyderabad

రోజువారీ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటాలన్న లక్ష్యం సాధించిన తరువాత కూడా భారత దేశం కోవిడ్ పరీక్షలలో దూసుకుపోతున్నది. వరుసగా గడిచిన రెండు రోజులలో దేసవ్యాప్తంగా రోజుకు 11.70  లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించింది. గడిచిన 24 గంటలలో ఈ సంఖ్య 11,69,765  గా నమోదైంది. ప్రపంచంలో మరే దేశమూ రోజుకు ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు జరపటం లేదు.

ఇలా రోజువారీ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తూండటంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 4.7 కోట్లకు దగ్గరవుతోంది. ఈ రోజు వరకూ జరిపిన పరీక్షల సంఖ్య కచ్చితంగా చెప్పాలంటే 4,66,79,145. ఇంత పెద్ద ఎత్తున శాంపిల్స్ పరీక్షిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల శాతం ఇంకా 7.5% లోపే నమోదవుతూ వస్తోంది. ఇప్పటివరకూ జరిపిన పరీక్షలలో పాజిటివ్ కేసుల శాతం 8.5% లోపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న " పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే మూడంచెల వ్యూహం ఆధారంగానే ఈ విజయం సాధించగలిగారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేస్తున్నాయి.

Description: WhatsApp Image 2020-09-04 at 10.35.11 AM.jpeg

కోవిడ్ పరీక్షలు వేగంగా పెంచుకుంటూ ముందుకు సాగుతుండటం వలన బాధితులను సకాలంలో గుర్తించగలుగుతున్నారు. అలా పాజిటివ్ క్సులను గుర్తించినవెంటనే లక్షణాల తీవ్రత ఆధారంగా ఐసొలేషన్ లో ఉండాల్సిందిగా సలహా ఇచ్చి క్రమం తప్పకుండా పర్యవేక్షించటమో, తీవ్రత ఎక్కువగా ఉంటే ఆస్పత్రికి తరలించి వైద్యుల ప్రత్యక్షపర్యవేక్షణలో చికిత్స అందించటమో నిర్ణయిస్తున్నారు. మరణాల శాతాన్ని 1% కంటే తక్కువగా ఉంచటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.  ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో మరణాల శాతం 1.74% గా నమోదైంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా తక్కువ.

పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో  ప్రస్తుతం లాబ్ ల సంఖ్య  1631 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 1025 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 606 ఉన్నాయి.

రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి:

తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  827  (ప్రభుత్వ:  465   + ప్రైవేట్:  362)

ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 683 (ప్రభుత్వ: 526 + ప్రైవేట్: 157)

సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 121  (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 87 )

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***


(Release ID: 1651229) Visitor Counter : 256