ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్య్ర సమరయోధుల్లో గుర్తింపు పొందని వీరుల గాథలను వెలుగులోకి తేవాలని
మన్ కీ బాత్ లో మాట్లాడుతూ విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఉద్భోధించిన ప్రధాని
Posted On:
30 AUG 2020 3:04PM by PIB Hyderabad
మన్ కీ బాత్ తాజా సంచికలో ప్రసంగిస్తూ స్వాతంత్య్ర సమరంలో పాలు పంచుకొని గుర్తింపు లేకుండా మరుగున పడిపోయిన వీరుల గాధలను వెలుగులోకి తేవాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు, అధ్యాపకులకు ప్రధాని ఉద్బోధించారు.
ఎవరైనా వ్యక్తి అతడు / ఆమె తమ విజయాలను గురించి ఆలోచించినప్పుడు వారికి సర్వదా తమ టీచర్లు గుర్తుకు వస్తారు. విశ్వ మహమ్మారి వల్ల మానవాళికి కలిగిన సంక్షోభం అధ్యాపకుల ముందు పెద్ద సవాలును ఉంచింది. అయితే ఈ సవాలును వారు అవకాశంగా స్వీకరించి కొత్త టెక్నాలజీలను మరియు సాధనాలను అందిపుచ్చుకొని వాటిని తమ విద్యార్థులకు బదిలీ చేశారు. జాతీయ విద్యా విధానం ప్రయోజనాలను విద్యార్థులకు వ్యాప్తి చేయడంలో టీచర్లు ముఖ్యమైన పాత్రను పోషించగలరనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశం 2022లో స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. అందువల్ల ఈనాటి విద్యార్థులకు స్వాతంత్య్ర సమర వీరుల గురించి తెలిసి ఉండటం అవసరం. మనం మన విద్యార్థులకు స్వాతంత్య్ర సమరం చరిత్ర నేపథ్యంలో స్థానిక పరిసరాల గురించి తెలియజెప్పాలి. అప్పుడే దాని ప్రతిధ్వని విద్యార్థుల వ్యక్తిత్వంలో కనిపిస్తుందని ఆయన అన్నారు.
ఆయా విద్యార్థులు నివసించే జిల్లాలలో స్వాతంత్య్ర సమరం జరిగిన రోజుల్లో ఏవైనా ఘట్టాలు జరిగాయా అనే విషయాన్ని వారికి పరిశోధనా అంశంగా ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు. తమ పట్టణంలో స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం ఉన్న స్థలానికి విద్యార్థుల విజ్ఞాన యాత్రను నిర్వహించాలి. స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని పాఠశాలల విద్యార్థులు మన స్వాతంత్య్ర సమర యోధుల గురించి 75 పద్యాలను మరియు నాటకాలను రచించడానికి సంకల్పించాలని ఆయన అన్నారు.
ఈ ప్రయత్నాల వల్ల గుర్తింపు లేకుండా కాలగర్భంలో కలసిపోయిన లక్షలాది మంది వీరుల కథలు వెలుగులోకి వస్తాయి. వచ్చే నెల సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం కావున టీచర్లు అందుకు అనువైన వాతావరణం సృష్టించడానికి పని చేయాలనీ ప్రధాని అన్నారు.
***
(Release ID: 1649912)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam