ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వ‌రుస‌గా రెండో రోజు కూడా రోజుకు 9 ల‌క్ష‌ల కోవిడ్ న‌మూనాల ప‌రీక్ష‌లు

మొత్తం 4 కోట్ల‌కు చేరిన ప‌రీక్ష‌లు

గ‌త రెండు వారాల‌లో కోటి మందికి పైగా ప‌రీక్ష‌లు

Posted On: 28 AUG 2020 1:15PM by PIB Hyderabad

దేశంలో ‌ రోజూ 9 ల‌క్ష‌లకు పైగా  కోవిడ్ -19 న‌మూనాల‌ను ,వ‌రుస‌గా నేడు రెండో రోజు కూడా ప‌రీక్షించారు. కేంద్ర ప్ర‌భుత్వ వ్యూహమైన‌ ప‌రీక్షించు, గుర్తించు, చికిత్స‌చేయు విధానంపై ప్ర‌ధానంగా దృష్టి పెడుతూ ఈ ప‌రీక్ష‌లు  నిర్వ‌హిస్తున్నారు.ఇండియాలొ ఇప్ప‌టికే రోజుకు 10 ల‌క్ష‌ల ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాన్ని ఏర్పాటుచేశారు‌. గ‌డ‌చిన 24 గంట‌ల‌లో దేశంలో 9,01,338 న‌మూనాల‌ను ప‌రీక్షించారు.


 


కోవిడ్ ప‌రీక్ష‌లు క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 4 కోట్ల‌కు చేరుతున్నాయి. మొత్తం ప‌రీక్ష‌లు ప్ర‌స్తుతానికి 3,94,77,848 కి చేరాయి. గ‌త రెండు వారాల‌లో కోటికిపైగా కోవిడ్ న‌మూనాల‌ను ప‌రీక్షించ‌డం జ‌రిగింది.

ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల‌కు, ప‌రీక్ష‌లు 28,607 కు గ‌ణ‌నీయంగా పెరిగాయి.  పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ద్వారా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌ల‌వారిని ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించడానికి, వారితో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన వారిని గుర్తించి వారిని ఐసోలేష‌న్‌లో ఉంచ‌డం, అవ‌స‌ర‌మైన వారికి స‌కాలంలో చికిత్స అందించ‌డానికి వీలు క‌లుగుతుంది.
ప్ర‌భుత్వం వివిధ స్థాయిల‌లో తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప‌రీక్ష‌ల వ్యూహం కార‌ణంగా దేశంలో ప‌రీక్ష‌ల ప‌రిధి విస్తృత‌మైంది. ఈ వ్యూహానికి  అనుగుణంగా, దేశంలో క‌రోనా ప‌రీక్ష‌ల ప్ర‌యోగ‌శాల‌ల నెట్ వ‌ర్క్‌ను  నిరంత‌రాయంగా బ‌లోపేతం చేస్తున్నారు.  ప్ర‌స్తుతం 1564 ప్ర‌యోగ‌శాల‌లు ఉండ‌గా ఇందులో 998 ల్యాబ్‌లు ప్ర‌భుత్వరంగంలో ఉండ‌గా 566 ల్యాబ్‌లు ప్రైవేటు  రంగంలో  ఉన్నాయి. ఇందులో:

-రియ‌ల్ టైమ్ ఆర్‌టి పిసిఆర్ ఆధారిత ప్ర‌యోగ‌శాల‌లు : 801 ( ప్ర‌భుత్వ‌రంగంలో 461 + ప్రైవేటులో 340)
-ట్రూనాట్ ఆధారిత టెస్టింగ్ ల్యాబ్‌లు :  643 ( ప్ర‌భుత్వం: 503 + ప్రైవేటు 140)
-సిబి నాట్ ఆధారిత టెస్టింగ్ ల్యాబ్‌లు :120   ( ప్ర‌భుత్వం :34   + ప్రైవేటు 86 )

 
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంప‌వ‌చ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

***

 



(Release ID: 1649266) Visitor Counter : 210