ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పాజిటివ్ కేసుల్లో ఇంకా చికిత్సలో ఉన్నవారు 22 శాతమే

కోలుకున్నవారు 26 లక్షలు, చికిత్సలో ఉన్నవారికంటే 18 లక్షలు అధికం

Posted On: 28 AUG 2020 12:06PM by PIB Hyderabad

 

"పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే కేంద్ర ప్రభుత్వపు వ్యూహానికి అనుగుణంగా భారత్ లో కోలుకున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. అదే క్రమంలో మరణాల శాతం కూడా తగ్గుతోంది. గడిచిన ఐదు నెలల కాలంలో కోవిడ్ నిర్థారణ జరిగిన వారిలో3/4  వంతు మంది కోలుకోగా ఇంకా చికిత్స పొందుతున్నవారు  1/4 వంతు మాత్రమే ఉన్నారు.

 

Description: Image


ఎక్కువమంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉండగా, మరికొందరు  ఇళ్ళలో ఏకాంతర వాసం నుంచి విముక్తులవుతున్నారు. దీనివలన భారత్ లో మొత్తం కోలుకున్నవారి సంఖ్య దాదాపుగా 26 లక్షలకు దగ్గరవుతోంది. గడిచిన 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కోవిడ్ నుంచి బైటపడినవారి శాతం 76.28% కు చేరింది.
ఆవిధంగా చూసినప్పుడు కోలుకున్నవారు ఇప్పటికీ చికిత్సలో ఉన్నవారి కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నారు.  అంటే 21.90%  మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. ఎక్కువమంది కోలుకుంటూ ఉండటంతో  చికిత్సలో ఉన్నవారి సంఖ్యకీ, కోలుకున్నవారి సంఖ్యకీ మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. అలా ఆ అంతరం ఈరోజు 18  లక్షలు ( కచ్చితంగా చెప్పాలంటే 18, 41,925 ) దాటింది.
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ కోవిడ్ ను అడ్డుకోవటంలో ఆదర్శంగా నిలిచింది. ఎవరెవరికి వ్యాధి సోకుతున్నదో గమనించటానికి తొలిదశలో గట్టి నిఘాపెట్టటం వలన పాజిటివ్ కెసులను గుర్తించటం సాధ్యమైంది. దానివలన వెంటనే ఐసొలేషన్ కు తరలించటమా, ఆస్పత్రికి తరలించటమా అనేది తగిన నిర్ణయం తీసుకోగలిగారు.
చికిత్స విషయంలోనూ సత్ఫలితాలు  సాధించగలిగేలా దేశం అంతటా ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు బాగా పెంచగలిగారు. అందుకోసం  ఐసియు పడకలు, వెంటిలేటర్లు ఉండే ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు, ఆక్సిజెన్ పడకలు, పిలవగానే అందుబాటులోకి వచ్చే డాక్టర్ సౌకర్యంతో కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు. ఐసొలేషన్ పడకలతో కూడిన కోవిడ్ కేర్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా దేశంలో మొత్తం 1723 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు, 3883 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, 11,689 కోవిడ్ కేర్ కేంద్రాలు  సేవలిందిస్తూ వచ్చాయి. వీటిలో 15,89,105 ఐసొలేషన్ పడకలు, 2,17,128  ఆక్సిజెన్ తోమ్ కూడిన పడకలు, 57,380 ఐసియు పడకలు ఉన్నాయి. సమర్థవంతమైన చికిత్స అందించటం వలన పాజిటివ్ కేసుల చికిత్స వలన వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ మరణాలు కూడా బాగా తగ్గి నేటికి 1.82% కి పడిపోయింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***



(Release ID: 1649261) Visitor Counter : 179