ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో పెరుగుతున్న కోలుకున్నవారి సంఖ్య
చికిత్సలో ఉన్నవారికంటే మూడున్నర రెట్లు ఎక్కువగా కోలుకున్నవారు
Posted On:
26 AUG 2020 1:06PM by PIB Hyderabad
దేశంలో ఈరోజు కోలుకున్నవారి సంఖ్య చికిత్సలో ఉన్నవారికంటే మూడున్నరరెట్లకు చేరింది. చాలా రోజులుగా కోలుకుంటున్నవారి సంఖ్య రోజుకు 60,000 కు పైగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో 63,173 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 24,67,758 కు చేరింది. దీనివలన కోలుకున్నవారి శాతం, చికిత్సలో ఉన్నవారి శాతం మధ్య అంతరం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
ఇప్పుడు 7,07,267 మంది చికిత్సలో ఉండగా కోలుకున్నవారు వారికంటే 17,60,489 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో దేశంలో కోలుకున్నవారి శాతం ఈ రోజు 76% (76.30%) దాటింది. ఇలా కోలుకున్నవారు పెరుగుతూ ఉండటం వల్ల దేశం మీద చికిత్స భారం కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది మొత్తం పాజిటివ్ కేసుల్లో 21.87% గా ఉంది.
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో పనిచేయటం వలన దూకుడుగా పరీక్షలు నిర్వహించటం సాధ్యమైంది. అదే విధంగా ఆస్పత్రిలో చేరినవారికి సమర్థవంతమైన చికిత్స అందించటం కారణంగా మరణాల సంఖ్య బాగా తగ్గింది. ఈనాటికి అది 1.84% కు చేరటంతో బాటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1648704)
Visitor Counter : 207
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam