ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో 23 లక్షలు దాటిన - రికవరీల సంఖ్య
చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కంటే మూడు రెట్లు పైగా నమోదైన - కోలుకున్న రోగుల సంఖ్య.
చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కంటే 16 లక్షలకు పైగా అధిగమించిన - రికవరీల సంఖ్య
Posted On:
24 AUG 2020 12:46PM by PIB Hyderabad
ఎక్కువ మంది రోగులు కోలుకొని, ఆసుపత్రుల నుండి డిశ్చార్జి కావడం మరియు ఇళ్ళల్లో ఐసోలేషన్ (తేలికపాటి, తక్కువ స్థాయి తీవ్రత కలిగిన కేసుల విషయంలో), భారతదేశంలో కోవిడ్-19 మొత్తం రికవరీల సంఖ్య ఈ రోజు 23 లక్షలను దాటింది.
వ్యాధి నిర్ధారణ పరీక్షా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, నిఘా మరియు కాంటాక్టు అయిన ఇతర రోగులను సమగ్రంగా గుర్తించడం, సమర్ధవంతంగా చికిత్సనందించడం ద్వారా 23,38,035 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి కావడానికి సాధ్యమైంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ వినియోగం, ఐ.సి.యు. లలో, ఆసుపత్రులలో మంచి నైపుణ్యం కలిగిన వైద్యులు, మెరుగైన అంబులెన్సు సేవలతో సహా ప్రామాణికమైన సంరక్షణ విధానాలపై దృష్టి కేంద్రీకరించడం మొదలైన పద్దతులను అవలంబించడంతో తీవ్రమైన మరియు క్లిష్టమైన కోవిడ్ రోగులు కూడా కోలుకోవడంతో, రికవరీ రేటు మెరుగుపర్చడానికి వీలు కలిగింది. ఇళ్ళల్లో ఐసోలేషన్ లో ఉన్నవారిని కూడా వైద్యపరంగా తరచుగా పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడంతో వారు కూడా వేగంగా కోలుకుంటున్నారు.
గత 24 గంటల్లో 57,469 మంది రోగులు కోలుకోవడంతో, భారతదేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 75 శాతం దాటి 75.27 శాతంగా నమోదయ్యింది. కోలుకుంటున్న రోగుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా పెరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
భారతదేశంలో కోవిడ్-19 వైద్య చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ( 7,10,771) కంటే 16 లక్షలకు పైగా (16,27,264) అధిగమించి కోలుకున్న రోగుల సంఖ్య నమోదయ్యింది. రికార్డు స్థాయిలో నమోదైన అధిక రికవరీలు భారతదేశం యొక్క వాస్తవ కేసుల భారాన్ని నిర్ధారిస్తాయి. క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 22.88 శాతం రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసు మరణాల రేటును తక్కువగా ఉంచడానికీ అది స్థిరమైన తగ్గుదలను కొనసాగించేందుకూ, ఐ.సి.యు. లలోని రోగులకు సమర్థవంతంగా అందిస్తున్న వైద్య చికిత్సా విధానం కీలక పాత్ర పోషిస్తోంది. కేసు మరణాల రేటు ఈ రోజు మరింతగా తగ్గి 1.85 శాతంగా నమోదయ్యింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రియాశీల సహకారంతో న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ నిర్వహిస్తున్న 'కోవిడ్-19 నిర్వహణపై జాతీయ ఈ-ఐ.సి.యు.' కార్యక్రమం, భారతదేశంలో కోలుకుంటున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరగడానికీ, మరణాల రేటు తగ్గడానికీ ప్రధాన పాత్ర పోషించింది. "జాతీయ ఈ-ఐసియు" కార్యక్రమం వారానికి రెండుసార్లు - మంగళవారం మరియు శుక్రవారం జరుగుతుంది. రాష్ట్రాల్లోని కోవిడ్ ఆసుపత్రుల ఐ.సి.యు. వైద్యుల ప్రయోజనం కోసం దీన్ని రూపొందించారు. కోవిడ్ చికిత్సకు సంబంధించి, వారు అడిగే ప్రశ్నలకు ఈ విధానం ద్వారా సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. ఇంతవరకు నిర్వహించిన ఇటువంటి 14 జాతీయ ఈ-ఐ.సి.యు. కార్యక్రమాల ద్వారా, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలోని 117 ఆసుపత్రులకు ప్రయోజనం చేకూరింది.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు : technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు : ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
(Release ID: 1648236)
Visitor Counter : 269
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam