ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో జరుపుతున్న పోరాటంలో కీలకమైన మైలురాయిని దాటిన - భారతదేశం.

ఒక రోజులో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు.

Posted On: 22 AUG 2020 12:31PM by PIB Hyderabad

రోజువారీ కోవిడ్-19 పరీక్షలను 10 లక్షలకు పెంచే వాగ్దానాన్ని కొనసాగిస్తూ, భారతదేశం ఈ రోజు కోవిడ్ కి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ముఖ్యమైన మైలురాయిని దాటింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన నిర్ణీత, కేంద్రీకృత, స్థిరమైన, సమన్వయ ప్రయత్నాలకు సాక్ష్యంగా, గత 24 గంటల్లో భారతదేశం ఒక మిలియన్ పరీక్షలు నిర్వహించింది. నిన్న 10,23,836 పరీక్షలు చేయడంతో, రోజూ 10 లక్షల నమూనాలను పరీక్షించాలనే సంకల్పాన్ని భారతదేశం సాధించింది.

 

ఈ సాధనతో, ఇంతవరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య  3.4 కోట్లను అధిగమించింది (3,44,91,073).

రోజువారీ పరీక్షల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గత మూడు వారాలలో సగటు రోజువారీ పరీక్షలు దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల మెరుగుదలలో సాధించిన పురోగతిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 

భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించిన విధంగా, ఆ ఆయా ప్రాంతాల్లో, పాజిటివ్ కేసుల రేటులో గణనీయమైన క్షీణత గమనించడమైంది.  అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన ప్రాంతాల్లో, ప్రారంభంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ,   సకాలంలో ఐసోలేషన్, సమర్థవంతమైన ట్రాకింగ్, సకాలంలో సమర్థవంతమైన, వైద్య చికిత్సా విధానం వంటి ఇతర చర్యలతో కలిపినప్పుడు ఇది చివరికి తగ్గుముఖం పట్టింది. 

మెరుగైన పరీక్షా విధానాలతో పాటు, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విధాన నిర్ణయాలు దేశవ్యాప్తంగా సులభంగా పరీక్షలు నిర్వహించడానికి దోహదపడ్డాయి.  ఇది రోజువారీ పరీక్షా సామర్థ్యాన్ని పెంపొందించింది. 

మెరుగైన వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వ్యవస్థ కూడా ఈ సాధనలో ఒక భాగంగా ఉంది.  నేడు, దేశంలో ప్రభుత్వ రంగంలో 983 ప్రయోగశాలలు, ప్రయివేటు రంగంలో 528 ప్రయోగశాలలతో మొత్తం 1,511 ప్రయోగశాలలతో దేశంలో పటిష్టమైన ప్రయోగశాలల వ్యవస్థ ఉంది. 

 ప్రయోగశాలల వివరాలు  విధంగా ఉన్నాయి : 

*     రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్.  ఆధారిత

       పరీక్షా ప్రయోగశాలలు : 778 (ప్రభుత్వ 458 + ప్రయివేటు320)  

*     ట్రూ-నాట్ ఆధారిత

       పరీక్షా ప్రయోగశాలలు : 615 (ప్రభుత్వ :   491 + ప్రయివేటు :  124 )   

*     సి.బి-నాట్ ఆధారిత

       పరీక్షా ప్రయోగశాలలు : 118 (ప్రభుత్వ : 34 + ప్రయివేటు :  84)   

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు :  technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన  ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****


(Release ID: 1647877) Visitor Counter : 242