హోం మంత్రిత్వ శాఖ
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశ 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోంమంత్రి న్యూఢిల్లీ లోని తమ నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
“స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, వారి శౌర్యం మరియు త్యాగంతో భారతదేశ స్వేచ్ఛకు సహకరించిన వారికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా, దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులైన స్త్రీ, పురుషులకు కూడా నా నివాళులు అర్పిస్తున్నాను.”
"మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న, స్వతంత్ర, బలమైన, స్వయం సమృద్ధిగల భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా సాకారమైనందుకు ఈ రోజు మనం గర్విస్తున్నాము."
"మోడీ ప్రభుత్వం, ఒక వైపు, పేద మరియు అణగారిన వర్గాలకు గృహ, విద్యుత్తు, ఆరోగ్య బీమాను అందించింది, మరోవైపు భారతదేశం శక్తివంతమైన దేశంగా అవతరించడానికి కృషి చేసింది."
“ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున, రండి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ కల నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేద్దాం. సాధ్యమైనంతవరకు ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా భారతదేశం కొత్త విజయాలు సాధించడానికి దోహదం చేద్దాం."
Posted On:
15 AUG 2020 12:30PM by PIB Hyderabad
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోంమంత్రి ఈ రోజు ఇక్కడ తమ నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ఒక సందేశమిస్తూ, “స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, వారి శౌర్యం మరియు త్యాగంతో భారతదేశ స్వేచ్ఛకు సహకరించిన వారికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా, దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులైన స్త్రీ, పురుషులకు కూడా నా నివాళులు అర్పిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ, "మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న, స్వతంత్ర, బలమైన, స్వయం సమృద్ధిగల భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా సాకారమైనందుకు ఈ రోజు మనం గర్విస్తున్నాము. మోడీ ప్రభుత్వం, ఒక వైపు, పేద మరియు అణగారిన వర్గాలకు గృహ, విద్యుత్తు, ఆరోగ్య బీమాను అందించింది, మరోవైపు భారతదేశం శక్తివంతమైన దేశంగా అవతరించడానికి కృషి చేసింది." అని పేర్కొన్నారు.

“ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున, రండి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ కల నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేద్దాం. సాధ్యమైనంతవరకు ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా భారతదేశం కొత్త విజయాలు సాధించడానికి దోహదం చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు."
*****
(Release ID: 1646050)
Visitor Counter : 203