హోం మంత్రిత్వ శాఖ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 926 మంది పోలీసులకు పురస్కారాలు

Posted On: 14 AUG 2020 1:41PM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 926 మంది పోలీసులు పురస్కారాలు అందుకున్నారు. సాహసోపేత విధి నిర్వహణకుగాను 215 మందికి 'పోలీసు శౌర్య పతకాలు' దక్కాయి. 80 మంది ‘రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవ పతకాలు’, 631 మంది ‘ప్రతిభావంత పోలీసు సేవ పతకాలు’ అందుకున్నారు.

    'పోలీసు శౌర్య పతకాలు' సాధించిన 215 మందిలో.., 123 మంది జమ్ము&కశ్మీర్‌లో, 29 మంది నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో, 8 మంది ఈశాన్య ప్రాంతంలో సాహసోపేత విధుల్లో పాల్గొన్నారు. ఈ 215 మందిలో.., 55 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది‌ కాగా, 81 మంది జమ్ము&కశ్మీర్‌, 23 మంది ఉత్తరప్రదేశ్‌, 16 మంది దిల్లీ, 14 మంది మహారాష్ట్ర, 12 మంది ఝార్ఖండ్‌ పోలీసులు ఉన్నారు. మిగిలినవారు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది.

***
 

 


(Release ID: 1645765)