ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రాన్ని రేపటి రోజు న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
07 AUG 2020 12:16PM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ మిశన్ కు సంబంధించిన ఒక పరస్పర సంభాషణాత్మక అనుభవ కేంద్రం ‘రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రం’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అనగా 2020వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ నాడు, ప్రారంభించనున్నారు. గాంధీజీ పాటించిన చంపారణ్ సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాల సందర్భం లో, అనగా 2017వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ నాడు, మహాత్మ గాంధీ కి శ్రద్ధాంజలి పూర్వకం గా రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రాన్ని (ఆర్ ఎస్ కె) గురించి ప్రధాన మంత్రి ప్రప్రథమం గా ప్రకటించడం జరిగింది.
ఆర్ ఎస్ కె ను నెలకొల్పడం వల్ల రాబోయే తరాలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రవర్తన లో పరివర్తన తాలూకు ప్రచార ఉద్యమం అయినటువంటి స్వచ్ఛ్ భారత్ మిశన్ యొక్క సఫల ప్రస్థానాన్ని గురించి సరి అయినటువంటి రీతి లో పరిచయం చేసుకోగలుగుతాయి. స్వచ్ఛత మరియు సంబంధిత దృష్టికోణాల విషయం లో వేరు వేరు సూచనల ను, చైతన్యాన్ని, ఇంకా తెలుసుకోదగిన ఇతర అంశాలను గురించి వివరించేలా ఆర్ఎస్ కె లో డిజిటల్ మరియు అవుట్ డోర్ ఇన్ స్టాలేశన్ లను మేలైన రీతి లో జోడించడమైంది. విభిన్న ప్రక్రియ లు మరియు కార్యకలాపాల సంక్లిష్ట అన్యోన్య క్రియ ను సంభాషణాత్మక తరహా లో సమ్మిళితం చేసి నేర్చుకొనేటటువంటి, ఉత్తమ అభ్యాసాలు, ప్రపంచ ప్రమాణాలు, విజయ గాధ లను ఇతివృత్త సంబంధి సందేశాల మాధ్యమం ద్వారా ఆవిష్కరించడం జరుగుతుంది.
ఒకటో పెద్ద గది లో, సందర్శకులు ఒక విశిష్టమైన 360 డిగ్రీ ల ఆడియో విజువల్ సమ్మోహక ప్రదర్శన ను వీక్షించవచ్చును. ఈ ప్రదర్శన భారతదేశం యొక్క స్వచ్ఛత గాధ- ఏదయితే ప్రపంచ చరిత్ర లోనే అతి పెద్దది అయినటువంటి నడవడిక లోని మార్పు నకు సంబంధించినటువంటి ప్రచార ఉద్యమం గా పేరుతెచ్చుకొన్నదో - ను కళ్లకు కడుతుంది. రెండో పెద్ద గది లో, బాపు దర్శించినటువంటి స్వచ్ఛ్ భారత్ యొక్క లక్ష్యాన్ని సాకారం చేయడం కోసం చేపట్టినటువంటి ఘనమైన కృషి ని చాటిచెప్పే సంభాషణాత్మక ఎల్ఇడి ఫలకాలు, హోలోగ్రామ్ బాక్సు లు, ఇంటరాక్టివ్ గేమ్స్, ఇంకా తదితర పూర్తి శ్రేణి ని కొలువుదీర్చడం జరిగింది. ఆర్ ఎస్ కె కు ఆనుకొని ఉన్న ఆరుబయలు పచ్చిక మైదానం లో నిర్వహించే మూడు ఓపెన్-ఎయర్ డిస్ ప్లే లు సత్యాగ్రహం నుండి స్వచ్ఛాగ్రహం వరకు భారతదేశం సాగించిన ప్రస్థాన క్రమాన్ని వివరిస్తూ సాగుతాయి. కేంద్రం యొక్క పరిసరాల లో నలు ప్రక్కల చోటు చేసుకొన్న కళాత్మకమైనటువంటి కుడ్య చిత్రాలు కూడాను మిశన్ తాలూకు సాఫల్యం యొక్క ముఖ్య ఘట్టాల ను వర్ణిస్తాయి.
ఆర్ఎస్ కె లో కలియదిరిగిన అనంతరం, ప్రధాన మంత్రి ఆర్ఎస్ కె యొక్క యాంఫిథియేటర్ లో దిల్లీ కి చెందిన 36 మంది పాఠశాల విద్యార్థుల తో సంభాషిస్తారు. ఈ 36 మంది విద్యార్థులు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కార్యక్రమం సందర్భం లో సామాజిక దూరం తాలూకు ప్రోటోకాల్ ను పాటించడం జరుగుతుంది. దీని తరువాత, దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
స్వచ్ఛ్ భారత్ మిశన్ భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల లో స్వచ్ఛత తాలూకు ముఖ చిత్రాన్నే సంపూర్ణం గా మార్చివేసింది. ఈ మహా కార్యక్రమం 55 కోట్ల మంది కి పైగా ప్రజ ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన అభ్యాసాన్ని మాన్పించి, వారు ఒక మరుగుదొడ్డి ని ఉపయోగించేటట్టుగా వారి యొక్క నడవడిక లో పరివర్తన ను తీసుకువచ్చింది. ఈ విషయం లో భారతదేశం అంతర్జాతీయ సముదాయం నుండి ఘన ప్రశంసల కు నోచుకొన్నది. అంతేకాక, అనుసరించడానికి వీలయినటువంటి ఒక ఉదాహరణ ను ప్రపంచం లోని మిగిలిన దేశాల కు మనం అందించినట్లు కూడా అయింది. ఇప్పుడు ఈ మిశన్ తన రెండో దశ లో, భారతదేశం లోని పల్లెపట్టుల ను ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన బారి నుండి విముక్తం అయిన (ఒడిఎఫ్) స్థితి నుండి ఒడిఎఫ్ ప్లస్ స్థితి కి చేర్చడాన్ని లక్ష్యం గా నిర్దేశించుకొన్నది. దీనిలో భాగం గా ఒడిఎఫ్ హోదా ను నిలబెట్టుకొంటూనే, దానితో పాటు అందరూ ఘన మరియు ద్రవ రూప వ్యర్థాల నిర్వహణ కు సముచితమైన చర్యల ను తీసుకొనేందుకు పూచీపడడం పైన శ్రద్ధ వహించడం జరుగుతుంది.
***
(Release ID: 1644154)
Visitor Counter : 268
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam