ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్ పరీక్షల నిర్వహణలో 2 కోట్లకుపైగా మైలు రాయిని దాటిన - భారతదేశం. 
                    
                    
                        మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 14,640 కి పెరిగింది. 
                    
                
                
                    Posted On:
                03 AUG 2020 2:13PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                భారతదేశం ఇప్పటివరకు 2,02,02,858 కోవిడ్-19 నమూనాలను పరీక్షించి, 2 కోట్ల పరీక్షల మైలురాయిని అధిగమించింది.   కోవిడ్-19 నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాలు అనుసరిస్తున్న, “భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం, సమర్థవంతంగా గుర్తించడంతో పాటు ఐసోలేషన్ మరియు సకాలంలో చికిత్సనందిచడం" అనే ముఖ్య వ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఇది సాధ్యమయ్యింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో, దేశవ్యాప్తంగా పరీక్షా సామర్థ్యాన్ని పెంచడానికి వీలుకలగడంతో పాటు, ప్రజలలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ నిర్ధారణా పరీక్షను సులభతరం చేసింది.
గత 24 గంటల్లో 3,81,027 నమూనాలను పరీక్షించడంతో, మిలియన్ జనాభా కు సగటు పరీక్షల సంఖ్య (టి.పి.ఎం) 14,640 కి పెరిగింది.  ప్రస్తుతం, భారతదేశంలో మిలియన్ జనాభాకు పరీక్షల సగటు (టి.పి.ఎం).  14, 640 గా ఉంది.   దేశంలో పరీక్షా కేంద్రాల సంఖ్య స్థిరంగా పెరుగుతూఉండడంతో, 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిలియన్ జనాభాకు సగటు పరీక్షల సంఖ్య,  జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదౌతోంది. 
 

దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాల సామర్ధ్యం ప్రభుత్వ రంగంలో 914 ప్రయోగశాలలు, ప్రయివేటు రంగంలో 434 ప్రయోగశాలలతో మొత్తం 1,348 ప్రయోగశాలలతో నిరంతరం బలోపేతమవుతోంది. 
ఆ ప్రయోగశాలల వివరాలు ఈ విధంగా ఉన్నాయి : 
*     రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్.  ఆధారిత
       పరీక్షా ప్రయోగశాలలు : 686 (ప్రభుత్వ:  418 + ప్రయివేటు:  268)  
*     ట్రూ-నాట్ ఆధారిత
       పరీక్షా ప్రయోగశాలలు : 556 (ప్రభుత్వ :   465 + ప్రయివేటు :  91 )   
*     సి.బి-నాట్ ఆధారిత
       పరీక్షా ప్రయోగశాలలు : 106 (ప్రభుత్వ : 31 + ప్రయివేటు :  75)   
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,
సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం
ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 
 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను
దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 
 technicalquery.covid19[at]gov[dot]in 
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  
 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా,
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 
ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  
లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. 
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన
***
కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
                
                
                
                
                
                (Release ID: 1643171)
                Visitor Counter : 342
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam