ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒకరోజులో కోలుకున్నవారు అత్యధికంగా నమోదు
మొత్తం కోలుకున్నవారు దాదాపు 11.5 లక్షలు
65.44% చేరుకున్న కోలుకున్న వారి శాతం
బాధితులలో మృతులు 2.13 శాతానికి తగ్గుదల
Posted On:
02 AUG 2020 12:40PM by PIB Hyderabad
భారత్ లో గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య బాగా పెరిగి 51,000 దాటింది. 51,225 మందికి నయమై డిశ్చార్జ్ కావటంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 11,45,629 కి చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం గరిష్ఠ స్థాయిలో65.44 శాతానికి చేరింది. అంటే, మరింత మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో చేస్తున్న కృషికి తోడు వైద్య సిబ్బంది సహా పోరాడుతున్న యోధుల నిస్వార్థ సేవల ఫలితంగా కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
బాధితుల సంఖ్యకూ, కోలుకున్నవారికీ మధ్య తేడా బాగా పెరుగుతూ వస్తోంది. జూన్ 10 న మొట్టమొదటిసారిగా కోలుకున్నవారి సంఖ్య బాధితులకంటే 1,573 మంది ఎక్కువగా ఉన్నట్టు నమోదైంది. ప్రస్తుతం అది 5,77,899 కి చేరింది. ఇంకా బాధితులుగా ఉన్నవారు మాత్రమే భారం కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,67,730 గా ఉంది. అంటే ఇది మొత్తం బాధితులలో 32.43%. వీరిలో ఎక్కువమంది ఆస్పత్రులలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉండగా ఇంకొందరి ఇళ్ళలో ఐసొలేషన్ లొ ఉన్నారు.
నివారణకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహం, దూకుడుగా పరీక్షలు జరపటం, ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన చికిత్సావిధానం పాటించటం ఫలితంగా కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో మరణాల రేటు బాగా తగ్గుతూ వచ్చింది. ప్రపంచంలో మరణాలు తక్కువగా నమోదైన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రపంచ సగటు కంటే తక్కువగా భారత్ లో 2.13% మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(Release ID: 1643049)
Visitor Counter : 343
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam