ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో ఇప్పటిదాకా కోటీ 82 లక్షల పరీక్షలు
ప్రతి పదిలక్షలకూ 13,181 కి పెరుగుదల
21 రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లో 10శాతానికి దిగువన పాజిటివ్ లు
Posted On:
30 JUL 2020 6:11PM by PIB Hyderabad
కోవిడ్ నివారణ, చికిత్స విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తదేక దృష్టితో తీసుకుంటున్న చర్యలు, దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంపు ద్వారా తొలిదశలోనే కేసుల గుర్తింపు, పాజిటివ్ కేసులను ఐసొలేషన్ లో ఉంచటం లాంటి చర్యల కారణంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. భారత వైద్య పరిశోధనామండలి చర్యలకారణంగా పరీక్షల విస్తృతి పెరగటం కూడా అందుకు తోడయింది.
గడిచిన 24 గంటల్లో 4,46,642 శాంపిల్స్ పరీక్షించారు. వారం వారం సగటు పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జులై మొదటి వారంలో 2.4 లక్షలు ఉండగా ఆఖరి వారానికల్లా అవి 4.68 లక్షలు పైబడ్డాయి.
దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరగటంలో కీలకమైన పాత్ర పోషించింది పెరుగుతున్న లాబ్ ల నెట్ వర్క్ అన్నది నిజం. నేటివరకూ దేశంలో ఉన్న లాబ్ ల సంఖ్య 1321 కాగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 907 , ప్రైవేట్ ఆధ్వర్యంలో 414 ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 676 (ప్రభుత్వ: 412 + ప్రైవేట్: 264)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 541 (ప్రభుత్వ: 465 + ప్రైవేట్: 76)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 104 (ప్రభుత్వ: 30 + ప్రైవేట్74 )
పరీక్షల మౌలిక వసతులు పెరగటం వలన జులై 1 నాటికి మొత్తం పరీక్షలు 88 లక్షలు ఉండగా జులై 30 నాటికి ఆ సంఖ్య కోటీ 82 లక్షలకు చేరింది.
అందుకు అనుగుణంగానే ప్రతి పది లక్షలకు జరిపిన పరీక్షలు 13,181 కి పెరిగాయి.
" పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స చెయ్యి " అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా దేశంలో పరీక్షల సంఖ్య పెంపు కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలతో పాజిటివ్ కేసుల శాతం 10% కంటే తక్కువగా నమోదవుతూ వస్తోంది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1642446)
Visitor Counter : 248