రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సలహాలను ఆహ్వానించడానికి గాను పబ్లిక్ డొమైన్లో 'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020న ‌రెండో ముసాయిదా

Posted On: 28 JUL 2020 2:41PM by PIB Hyderabad

'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డీఏపీ) 2020' అని పేరు పెట్టబడిన డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్ (డీపీపీ) 2020 యొక్క రెండవ ముసాయిదాపై వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల వారు సాధారణ ప్రజానీకం నుండి రక్షణ మంత్రిత్వ శాఖ
(ఎంఓడీ) సలహాలు / వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇందుకోసం ముసాయిదాను త‌న వెబ్‌సైట్
(https://mod.gov.in/dod/sites/default/files/Amend270720_0.pdf)లో అప్‌లోడ్ చేసింది. తొల‌త ఏప్రిల్ 17, 2020 నాటికి ముసాయిదాపై వివిధ వాటాదారుల నుండి వ్యాఖ్యలు / సిఫార్సులు / సలహాలు ఆహ్వానిస్తూ ఎంఓడీ వెబ్‌సైట్‌లో డీపీపీ హోస్ట్ చేసింది. త‌రువాత ఆఖ‌రి గ‌డువును ఈ ఏడాది మే 8వ తేదీ వ‌ర‌కు పొడిగింది. అప్పటి నుండి, వివిధ వాటాదారులు, సేవలు, పరిశ్రమల వారి నుండి 10,000 పేజీలకు పైగా సూచనలు వచ్చాయి. వివిధ ఏజెన్సీల నుండి వచ్చిన ఈ వ్యాఖ్యల యొక్క విశ్లేషణ తరువాత, ఆయా ప‌క్షాల వారి ఖచ్చితమైన ఆందోళనలను అర్థం చేసుకోవడానికి వ్యక్తిగతంగా మరియు వెబ్ సమావేశాల ద్వారా అన్ని వర్గాల వాటాదారుల యొక్క మొత్తం స్పెక్ట్రమ్‌తో నిర్దిష్ట పరస్పర చర్యలు జరిగాయి. సవరించిన రెండవ ముసాయిదాను ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగంగా ప్రకటించిన రక్షణ సంస్కరణల సిద్ధాంతాలచే నడిచే సమీక్ష కమిటీ ఖరారు చేసింది. దీనిని ప్రజాక్షేత్రంలో ఉంచారు. ఆగస్టు 10, 2020 నాటికి సవరించిన ముసాయిదాపై నిర్దిష్ట వ్యాఖ్యలు మరోసారి అభ్యర్థించారు.


 

********


(Release ID: 1641858) Visitor Counter : 283