ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒకే రోజులోనే 4.2 లక్షల కోవిడ్ పరీక్షలు చేసి రికార్డు నెలకొల్పిన ఇండియా
ఇంతవరకూ 1.6 కోట్ల నమూనాలకు పరీక్షలు
2.35 శాతానికి పడిపోయిన కోవిడ్ -19 మరణాల రేటు
Posted On:
25 JUL 2020 2:25PM by PIB Hyderabad
దేశంలోనే మొదటిసారిగా ఒకే రోజులోనే 4లక్షలా 20 వేల కోవిడ్ టెస్టులు చేయించడంద్వారా ఇండియా రికార్డు నెలకొల్పింది. గత వారం రోజులుగా ప్రతి రోజూ 3 లక్షల యాభైవేల వరకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒకే రోజులోనే 4 లక్షలా 20 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 4 లక్షలా 20 వేలా 898 నమూనాలను పరీక్షించడంతో ప్రతి పది లక్షల జనాభాకు 11, 485 టెస్టులు జరిగినట్టయింది. దాంతో దేశంలో మొత్తం మీద ఒక కోటీ 58 లక్షలా 49 వేల 68 టెస్టులు చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా నెలకొల్పిన ల్యాబుల కారణంగా ఈ విజయం సాధించడం జరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో ఒకే ఒక కోవిడ్ టెస్ట్ ల్యాబు వుంటే ఇప్పుడా సంఖ్య 1301కి చేరుకుంది. వీటిలో 902 ల్యాబులు ప్రభుత్వరంగంలో వుంటే 399 ప్రైవేటు రంగంలో వున్నాయి. టెస్టుల మార్గదర్శకాల్లో ఐసిఎంఆర్ మార్పులు చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా చర్యలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా టెస్టింగ్ బాగా పెరిగింది.
టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేందప్రభుత్వం సలహా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా భారీస్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి. దాంతో ప్రతి రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలో ఇలా పెరిగినప్పటికీ రాను రాను ఈ సంఖ్య తగ్గుతుంది. ఢిల్లీలో కేంద్రం చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విధంగానే దేశవ్యాప్తంగా ఇది ప్రతిఫలిస్తుంది.
సమర్థవంతమైన, ప్రమాణాలతో కూడిన వైద్య ఆరోగ్య మార్గదర్శకాల కారణంగాను, సమగ్రమైన భద్రత విధానం అనుసరించడంవల్ల దేశవ్యాప్తంగా మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు చేపట్టిన ఉమ్మడి చర్యల కారణంగా కోవిడ్ మరణాల రేటు అదుపులో వుంది. ఈ రోజున ఇది 2.35 శాతానికి పడిపోయింది. ప్రపచంలోనే తక్కువ కోవిడ్ మరణాల రేటు వున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32, 223 మంది కోవిడ్ బాధితులు కోలుకోవడం జరిగింది. దాంతో ఈ రోజుకు మొత్తం కోలుకున్న కేసులు 8, 49, 431. దాంతో రికవరీ రేటు సరికొత్తగా 63. 54 శాతానికి చేరుకున్నట్టయింది. కోలుకున్న రోగులకు, కోవిడ్ బాధితులకు మధ్యన తేడా 3 లక్షలా 93 వేల 360కి చేరుకుంది.
కోవిడ్-19 కు సంబంధించిన అన్ని రకాల తాజా సమాచారం కోసం, సాంకేతిక సమస్యల పరిష్కారం, మార్గదర్శకాలు, సూచనలు సలహాలకోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA ను సందర్శించండి. సాంకేతిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం technicalquery.covid19[at]gov[dot]in కు ఇంకా ఇతర సందేహాలకోసం ncov2019[at]gov[dot]in లేదా @CovidIndiaSeva సంప్రదించండి. ఫోన్ చేసి మాట్లాడాలనుకునేవారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 or 1075 (Toll-free)ను సంప్రదించగలరు. రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్లను
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf ద్వారా పొందగలరు.
***
(Release ID: 1641194)
Visitor Counter : 199
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam