ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ల్యాబ్ మౌలిక సౌకర్యాలు వేగవంతంగా పెరగడంతో 'పరీక్షలు, శోధన, చికిత్స' వ్యూహం మరింత ముందుకు
ఇప్పటి వరకు 1.5 కోట్ల నమూనాలకు పరీక్షలు
Posted On:
24 JUL 2020 3:22PM by PIB Hyderabad
ఇప్పటి వరకు పరీక్షించిన కోవిడ్ నమూనాలు 1.5 కోట్లు దాటింది (1,54,28,170). గత 24 గంటల్లోనే 3,52,801 నమూనాలను కోవిడ్ గుర్తింపు కోసం పరీక్షించారు. దీని ప్రకారం ప్రతి మిలియన్ మంది (టిపిఎం) లో 11,179.3 మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నట్టు తేలింది. ఈ వ్యూహాన్ని అమలు చేయడం వల్ల పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తోంది.

క్రమంగా ల్యాబ్ ల సంఖ్య (ఇప్పటి వరకు 1290) పెరగడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాల వల్ల పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఆర్‌టి-పిసిఆర్ ల్యాబ్‌లు ఐసిఎంఆర్ సూచించిన తాజా పరీక్షా వ్యూహానికి కీలకంగా పని చేసాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ల్యాబ్‌ల సంఖ్య గతిశీలంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో 897 ల్యాబ్‌లు, ప్రైవేట్ రంగంలో 393 ల్యాబ్‌లు ఉన్నాయి. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
• రియల్ టైమ్ ఆర్‌టి-పిసిఆర్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 653 (ప్రభుత్వం: 399 + ప్రైవేట్: 254)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 530 (ప్రభుత్వం: 466 + ప్రైవేట్: 64)
• సీబీనాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 107 (ప్రభుత్వం: 32 + ప్రైవేట్: 75)
COVID-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & సలహాదారులపై అన్ని ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.
కోవిడ్ 19పై సాంకేతిక సమస్యలను technicalquery.covid19[at]gov[dot]in కి మెయిల్ చేయండి
ఇతర సమస్యలను ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva లో తెలియజేయండి.
హెల్ప్ లైన్ : +91-11-23978046 or 1075 (Toll-free).
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(Release ID: 1640964)
Read this release in:
Marathi
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil