రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హెచ్-సీఎన్‌జీని ఆటోమోటివ్ ఇంధనంగా చేర్చడానికి ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన ఎంఓఆర్‌టీహెచ్
प्रविष्टि तिथि:
23 JUL 2020 9:45AM by PIB Hyderabad
హైడ్రోజన్ సుసంపన్నమైన సీఎన్‌జీని ఆటోమోటివ్ ఇంధనంగా చేర్చేందుకు గాను జూలై 22, 2020 నాటి జీఎస్ఆర్ 461 (ఈ) ద్వారా సెంట్రల్ మోటారు వాహనాల నిబంధన 1979కు సవరణ నిమిత్తం ప్రజల నుండి మరియు అన్ని భాగస్వామ్యపక్షాల వారి నుండి వ్యాఖ్యలను మరియు తగిన సలహాలను కోరుతూ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్) ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇది దేశంలో ఆటోమొబైల్స్ నిమిత్తం వివిధ రకాల హరిత ఇంధనాలను ప్రోత్సహించే విషయమై మంత్రిత్వ శాఖ మరో ముందడుగు. ఈ విషయంలో సూచనలు లేదా వ్యాఖ్యలను ప్రభుత్వం ఆహ్వానించింది. జాయింట్ సెక్రటరీ (ఎంవీఎల్), రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, రవాణా భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ -110001 (ఈమెయిల్: jspb-morth[at]gov[dot]in) నోటిఫికేషన్ విడుదలైన ముప్పై రోజులలోపు వీటిని పంపాలి.
***
(रिलीज़ आईडी: 1640633)
आगंतुक पटल : 191