ప్రధాన మంత్రి కార్యాలయం

కాకరాపార్ పరమాణు శక్తి ప్లాంటు-3 లో క్రిటికలిటీ ని సాధించినందుకు గాను భారతీయ పరమాణు శాస్త్రవేత్తల కు అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2020 10:44AM by PIB Hyderabad

కాకరాపార్ పరమాణు శక్తి ప్లాంటు-3 ను సాధారణ నిర్వహణ స్థితి కి (క్రిటికల్) తీసుకు వచ్చినందుకు గాను భారతీయ పరమాణు శాస్త్రవేత్తల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఒక ట్వీట్ లో, ‘‘కాకరాపార్ పరమాణు శక్తి ప్లాంటు-3 ను సాధారణ నిర్వహణ స్థితి కి తెచ్చిన మన పరమాణు వైజ్ఞానికుల కు ఇవే అభినందన లు.  దేశీయం గా రూపరచన చేసిన 700 ఎండబ్ల్యుఇ సామర్థ్యం కలిగినటువంటి కెఎపిపి-3 రియేక్టర్ ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క ఒక ప్రసిద్ధికెక్కిన ఉదాహరణ గా నిలచింది.  ఇది రాబోయే కాలం లో ఈ కోవ కు చెందిన అనేక కార్య సాధనల కు ఒక అనుసరణీయమైనటువంటి మార్గాన్ని వేసింది కూడా ను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 


***



(Release ID: 1640444) Visitor Counter : 181