ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

7.2 లక్షలకు చేరిన రికవరీ కొవిడ్‌ కేసులు

62.72 శాతానికి పెరిగిన జాతీయ రికవరీ రేటు

2.43 శాతానికి తగ్గిన మరణాల రేటు

Posted On: 21 JUL 2020 7:41PM by PIB Hyderabad

కొవిడ్‌-19 కేసులపై సమర్థవంత నిఘా కోసం స్థిరమైన, చురుకైన, సాక్ష్య ఆధారిత వ్యూహాలు; దేశవ్యాప్తంగా ఉన్న సమర్థవంత ప్రయోగశాలల ద్వారా పరీక్షలతోపాటు, సమర్థవంత చికిత్స కోసం ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్‌ పాటించిన ఫలితంగా.. గత 24 గంటల్లో రికవరీ కేసుల సంఖ్య 24,491గా నమోదైంది. దీనివల్ల ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,24,577కు చేరింది.

జాతీయ రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగింది.

కొవిడ్‌ మరణాల రేటు 2.43 శాతానికి తగ్గింది. మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కొనసాగుతోంది. దేశంలో మరణాల రేటు స్థిరంగా పడిపోతోంది.

కోలుకున్న వారి సంఖ్య, క్రియాశీల కేసుల సంఖ్య మధ్య ప్రస్తుతమున్న భేదం 3,22,048.

 

Combined Final 21st July Press Brief.jpg

    గత 24 గంటల్లో 3,33,395 నమూనాలను పరీక్షించారు. మొత్తంగా 1,43,81,303 నమూనాలను ఇప్పటివరకు పరీక్షించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 892 పరీక్ష కేంద్రాలు, ప్రైవేటు రంగంలో ఉన్న 382 పరీక్ష కేంద్రాలు కలిపి, 1274 కేంద్రాల ద్వారా ఈ పరీక్షలు చేశారు. అవి: 

• రియల్‌ టైమ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు: 651 (ప్రభుత్వం: 398 + ప్రైవేట్‌: 253)
• ట్రూనాట్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు: 516 (ప్రభుత్వం: 457 + ప్రైవేట్‌: 59)
• సీబీనాట్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు: 107 (ప్రభుత్వం: 37 + ప్రైవేట్‌: 70)
    
    కొవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు&సూచనలపై అధికారిక, తాజా సమాచారం కోసం https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA ను చూడవచ్చు.

    కొవిడ్‌-19పై సాంకేతిక సందేహాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు; ఇతర సందేహాలుంటే ncov2019[at]gov[dot]in లేదా @CovidIndiaSeva కు పంపవచ్చు.

    కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-1123978046 లేదా 1075 (ఉచితం) కి ఫోన్‌ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితాను https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో చూడవచ్చు. 

***



(Release ID: 1640283) Visitor Counter : 232