హోం మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ లాల్‌జీ టాండన్‌ కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా లాల్‌జీ, తన మొత్తం జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు, ఆయన మరణం దేశానికి నిజమైన లోటు: కేంద్ర హోంమంత్రి

ప్రజా సేవకుడిగా భారత రాజకీయలపై ఆయన స్పష్టమైన ముద్ర వేశారు: అమిత్‌ షా
లాల్‌జీ టాండన్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన అమిత్‌ షా

प्रविष्टि तिथि: 21 JUL 2020 12:08PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ లాల్‌జీ టాండన్‌ మరణం పట్ల, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన, తన మొత్తం జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని ట్వీట్‌ చేశారు. 

ప్రజా సేవకుడిగా భారత రాజకీయలపై లాల్‌ జీ లోతైన ముద్ర వేశారని, ఆయన మరణం దేశానికి తీరని లోటని ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు. 

లాల్‌జీ టాండన్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించి, ఆయన కుటుంబ సభ్యులకు అమిత్‌ షా సంతాపం ప్రకటించారు.

***


(रिलीज़ आईडी: 1640171) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam