ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో జూలై 22వ తేదీ న కీలకోపన్యాసమివ్వనున్న ప్రధాన మంత్రి
Posted On:
21 JUL 2020 11:35AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 22 వ తేదీ న జరిగే ‘ఇండియా ఐడియాజ్ సమిట్’ లో కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.
ఈ శిఖర సమ్మేళనాన్ని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం ఈ కౌన్సిల్ యొక్క 45 వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ‘ఒక మెరుగైన భవిష్యత్తు ను నిర్మించడం’ అనేది ఈ సంవత్సరం లో ఇండియా ఐడియాజ్ సమిట్ యొక్క ఇతివృత్తం గా ఉన్నది.
వర్చువల్ మాధ్యమం లో జరిగే ఈ శిఖర సమ్మేళనాని కి భారత ప్రభుత్వం లోని మరియు యుఎస్ ప్రభుత్వం లోని విధాన రూపకర్తలు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇంకా సమాజం మరియు వ్యాపార రంగాల కు చెందిన ప్రముఖ ఆలోచనపరులు హాజరు కానున్నారు. శిఖర సమ్మేళనం లో ప్రసంగించే ఇతర ముఖ్య వక్తల లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్, యు.ఎస్. విదేశాంగ శాఖ మంత్రి శ్రీ మైక్ పోమ్పియో, వర్జీనియా సెనటర్ మరియు సెనిట్ ఇండియా కాకస్ యొక్క సహ అధ్యక్షుడు శ్రీ మార్క్ వార్నర్, ఐక్య రాజ్య సమితి కి యు.ఎస్. పూర్వ రాయబారి నిక్కీ హేలీ తదితరులు ఉన్నారు. భారతదేశం- యుఎస్ సహకారం మరియు విశ్వమారి అనంతర జగతి లో ఉభయ దేశాల మధ్య గల సాంప్రదాయక సంబంధాల యొక్క భవితవ్యం సహా పలు రంగాల పై శిఖర సమ్మేళనం లో చర్చ లు చోటు చేసుకోనున్నాయి.
***
(Release ID: 1640157)
Visitor Counter : 241
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam