ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గడచిన 24 గంటల్లో 23,600 మందికి పైగా నయం అయ్యారు

చికిత్స పొందుతున్న వారి కన్నా కోలుకున్న వారు 3 లక్షలు పైగా ఉన్నారు

ఒక మిలియన్ మందిలో జరుగుతున్న పరీక్షలు 10,000 కి చేరుకుంటున్నాయి

Posted On: 19 JUL 2020 5:56PM by PIB Hyderabad

పరీక్షల సంఖ్యను మరింత ఉధృతంగా చేపట్టడంతో పాటు సకాలంలో రోగ నిర్ధారణ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర / యుటి ప్రభుత్వాల చురుకైన చర్యలు కేసులను ముందుగా గుర్తించడంలో సహాయపడ్డాయి. బాగా అమలు చేసిన స్టాండర్డ్ ఆఫ్ కేర్ ప్రోటోకాల్ ద్వారా మామూలు స్థాయికేసులు, తీవ్రమైన కేసులను సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణ చేపట్టడంతో కోవిడ్ రోగులలో అధిక రికవరీ రేటు కనిపించింది.

గడచిన 24 గంటల్లో కోలుకున్న రోగుల సంఖ్య 23,672 గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య 3,04,043 పెరిగింది. మొత్తం కోలుకున్నవారు 6,77,422 మంది ఉన్నారు. వీరి రేటు 62.86%గా ఉంది.  

ఆసుపత్రులు, గృహ ఐసొలేషన్ లో ఉన్న 3,73,379 క్రియాశీల కేసులకు వైద్య సహాయం అందిస్తున్నారు. దేశం పరీక్షా మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయి. ఐసిఎంఆర్ సూచించిన పరీక్షా వ్యూహం అన్ని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు పరీక్షను సిఫారసు చేయడానికి అనుమతిస్తుంది. రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ (పిఒసి) పరీక్షతో పాటు రాష్ట్రాలు / యుటిలచే విస్తృతంగా గోల్డ్-స్టాండర్డ్ ఆర్టి-పిసిఆర్ ఆధారిత పరీక్షను సులభతరం చేసింది. పరీక్షించిన నమూనాల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 3,58,127 నమూనాలను పరీక్షించారు. మొత్తం 1,37,91,869 నమూనాలను పరీక్షించిన మన దేశంలో మిలియన్ మందిలో పరీక్షలు జరుగుతున్న వారి సంఖ్య (టిపిఎం)  9994.1 కి చేరుకుంది.

స్థిరంగా విస్తరిస్తున్న డయాగ్నొస్టిక్ ల్యాబ్ నెట్‌వర్క్‌లో 1262 ల్యాబ్‌లు ఉన్నాయి, వీటిలో ప్రభుత్వ రంగంలో 889 ల్యాబ్‌లు, 373 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయి.

• రియల్ టైమ్ ఆర్టి-పిసిఆర్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 648 (ప్రభుత్వం: 397 + ప్రైవేట్: 251)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 510 (ప్రభుత్వం: 455 + ప్రైవేట్: 55)
• సిబి నాట్ CBNAAT ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 104 (ప్రభుత్వం: 37 + ప్రైవేట్: 67)

కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.

technicalquery.covid19[at]gov[dot]in 

ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva     

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf.  

హెల్ప్ లైన్ నంబర్లు :  +91-11-23978046 లేదా 1075 (Toll-free). 

****



(Release ID: 1639869) Visitor Counter : 233