ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వాస్తవంగా చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగుల సంఖ్య 3,31,146 మాత్రమే

వాస్తవంగా చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మొత్తం కేసులలో 1/3 వ వంతు మాత్రమే

చికిత్స అనంతరం 6.1 లక్షలకు పైగా రోగులు కోలుకున్నారు.

Posted On: 16 JUL 2020 2:06PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలతో పాటు ‘మొత్తం ప్రభుత్వం’ వ్యూహం కింద శ్రేణీకృత, చురుకైన చర్యలు మరియు సక్రియ దృష్టి కోణంతో భారత ప్రభుత్వం పనిచేసింది.  సామూహిక ప్రయత్నాలను క్రమం తప్పకుండా అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు మరియు పర్యవేక్షిస్తున్నారు. 

లక్ష్య చర్యలు క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గడానికి దోహదపడ్డాయి.  రోజు వరకు, దేశంలో వాస్తవంగా చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగుల సంఖ్య 3,31,146 మాత్రమే. చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసులలో మూడవ వంతు (34.18 శాతం) కన్నా కొంచెం ఎక్కువగా  ఉంది.  ఇంటింటి సర్వే,  వ్యాధి వ్యాపించిన ప్రాంతాల్లో నియంత్రణ కార్యకలాపాలు, సకాలంలో కాంటాక్టులను గుర్తించడం, కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిఘా,  విస్తృతంగా పరీక్షలు, సకాలంలో వ్యాధి నిర్ధారణ, కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరిగే విధంగా బాగా అమలు చేయబడిన సంరక్షణ పద్ధతుల ద్వారా సాధారణ, తీవ్రమైన కేసులకు సమర్థవంతమైన చికిత్సా విధానాల నిర్వహణ వంటి నియంత్రణ యొక్క చురుకైన చర్యల కారణంగా దేశంలో కోవిడ్-19 రోగుల వాస్తవ సంఖ్య పరిమితంగా, నిర్వహించదగినదిగా ఉంది. 

పరీక్షా సామర్థ్యాన్ని పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, ఎస్.ఏ.ఆర్.ఐ. / ఐ.ఎల్.ఐ. కేసులలో నిఘాకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వృద్ధాప్య జనాభా మరియు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాల సేకరణ వంటి అంశాలను నిర్ధారించడానికి కేంద్రం మరియు రాష్ట్ర / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా భారతదేశం అంతటా రికవరీ రేట్లలో నిరంతర మెరుగుదల కనిపిస్తోంది. 

 

 

గ్రాఫ్ ను చూసినట్లయితే, 2020 జూన్ మధ్యలో రికవరీ రేటు 50 శాతం మార్కు దాటిన తరువాత, కోలుకున్న రోగుల సంఖ్య స్థిరంగా పెరగడంతో పాటు, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య తగ్గిన విషయాన్ని గమనించవచ్చు.  కోవిడ్-19 సోకిన మొత్తం రోగులలో ఇంతవరకు 63.25 శాతం మంది రోగులు కోలుకున్నారు. అదే సమయంలో, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కూడా స్థిరంగా తగ్గుతూ వచ్చింది. 2020 జూన్ నెల మధ్యలో 45 శాతంగా ఉన్న ఈ రోగుల సంఖ్య ఇప్పుడు 34.18 శాతానికి తగ్గింది. 

చికిత్స అనంతరం గత 24 గంటల్లో 20,783 మంది కోవిడ్-19 రోగులు కోలుకోవడంతో, చికిత్స అనంతరం కోలుకున్న మొత్తం కోవిడ్-19 రోగుల సంఖ్య 6,12,814 కు చేరుకుంది.  కోలుకున్న రోగులు మరియు కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల మధ్య తేడా మరింత పెరిగి 2,81,668 కు చేరింది. 

కోవిడ్-19 చికిత్సకు అవసరమైన ఆసుపత్రి మౌలిక సదుపాయాలతో, కేటగిరి-I లో 1,381 కోవిడ్ కోసం అంకితమైన ఆస్పత్రులు, కేటగిరి-II లో  3,100 కోవిడ్ కోసం అంకితమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, కేటగిరీ-III లో 10,367 కోవిడ్ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.  వీటిలో మొత్తం 46,666 ఐ.సి.యు. పడకలు ఉన్నాయి. 

కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య భాగస్వామ్య వ్యూహం, దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను నియంత్రించడానికి సహకరించింది. దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్న మొత్తం రోగుల్లో 48.15 శాతం మంది రోగులు మహారాష్ట్ర, తమిళనాడు - రెండు రాష్ట్రాలలోనే ఉన్నారు.  కాగా, మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో చికిత్స పొందుతున్న మొత్తం రోగుల్లో 84.62 శాతం మంది రోగులు కేవలం 10 రాష్ట్రాల్లో ఉన్నారు.  బాధిత వ్యక్తుల నియంత్రణ మరియు సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణ విషయాలలో ఈ రాష్ట్రాలకు కేంద్రం తన సహాయాన్ని కొనసాగిస్తోంది. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****


(Release ID: 1639151) Visitor Counter : 254