ప్రధాన మంత్రి కార్యాలయం
ఆచార్య శ్రీ పురుషోత్తంప్రియదాస్ జీ స్వామిశ్రీ మహారాజ్ యొక్క కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 JUL 2020 10:51AM by PIB Hyderabad
ఆచార్య శ్రీ పురుషోత్తంప్రియదాస్ జీ స్వామిశ్రీ మహారాజ్ యొక్క కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశం లో ‘‘సమాజాని కి ఆచార్య శ్రీ పురుషోత్తంప్రియదాస్ జీ స్వామిశ్రీ మహారాజ్ చేసిన పవిత్ర సేవ కు గాను మనం ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకొంటాము. ఆయన మానవుల బాధల ను తగ్గించడం కోసం మరియు కరుణ ను పెంపు చేయడం కోసం కఠోరం గా శ్రమించారు. ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తం గా కూడా అసంఖ్యాక ప్రజ ఆయన ను స్మరించుకొంటూ ఉంటుంది.
ఆచార్య శ్రీ పురుషోత్తంప్రియదాస్ జీ స్వామిశ్రీ మహారాజ్ కు అపారమైన జ్ఞానం ప్రాప్తించింది. సాముదాయిక సేవ, విద్య, ఇంకా మహిళల కు సాధికారిత కల్పన ల పట్ల ఆయన ప్రభావాన్ని సదా జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన తో అనేక సార్లు చర్చించే అవకాశాలు నాకు దక్కాయి మరి ఆ సంగతుల ను నేను ఎన్నటికీ మరచిపోను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1639074)
సందర్శకుల సూచీ సంఖ్య : : 203
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam