ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ - ఇప్పటివరకు పురోగతి

ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ అమలును సమీక్షించిన - ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.

Posted On: 12 JUL 2020 11:51AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి 20 లక్షల కోట్ల రూపాయలతో అంటే, భారతదేశ జి.డి.పి.లో 10 శాతానికి సమానమైన ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజీని గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2020 మే 12వ తేదీన  ప్రకటించారు.  ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధి భారత్ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు.  ఆత్మ నిర్భర్ భారత్ కు చెందిన ఐదు మూల స్థంభాలైన - ఆర్ధిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, విధానము, శక్తివంతమైన జనాభా, మరియు డిమాండ్ ల గురించి కూడా ఆయన వివరించారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రకటన అనంతరం, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2020 మే 13వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు వరుస పత్రికా సమావేశాలలో  ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ వివరాలను తెలియజేసారు. 

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటనల అమలును ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు వెంటనే ప్రారంభించాయి.  ఆర్థిక ప్యాకేజీ అమలును నిరంతర సమీక్షలతో ఆర్థిక మంత్రి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.

శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇటీవల నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఈ క్రింది పురోగతిని ఇప్పటివరకు నివేదించబడింది :

1.        200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ సేకరణ టెండర్లలో అంతర్జాతీయ టెండర్లు అనుమతించబడవు :

స్థానిక ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు భారీ ప్రోత్సాహం ఇస్తూ, అంతర్జాతీయ టెండర్లకు సంబంధించిన 2017-సాధారణ ఆర్థిక నియమాలు మరియు జి.ఎఫ్.ఆర్. నియమాలకు చెందిన ప్రస్తుత నిబంధన 161 (iv) , ను వ్యయ శాఖ సవరించింది.  ఇప్పుడు, కేబినెట్ సచివాలయం నుండి ముందస్తు అనుమతి పొందితే తప్ప, 200 కోట్ల రూపాయల వరకు టెండర్లకు అంతర్జాతీయ టెండర్ విచారణ (జి.టి.ఈ) లను ఆహ్వానించవలసిన అవసరం లేదు. 

2.      కాంట్రాక్టర్లకు సహాయం :  

రైల్వే, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, సి.పి.డబ్ల్యు.డి. వంటి అన్ని కేంద్ర ఏజెన్సీలు ఈ.పి.సి., మరియు రాయితీ ఒప్పందాలకు సంబంధించి కాంట్రాక్టు బాధ్యతలను పూర్తి చేయడానికి 6 నెలల వరకు పొడిగింపును ఇస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఈ విషయంలో, ఫోర్స్ మేజూర్ క్లాజ్ (ఎఫ్.‌ఎం.సి) ను అనుసరించి (కోవిడ్-19 మహమ్మారి కారణంగా), కాంట్రాక్టర్ / రాయితీదారుపై ఎటువంటి  ఖర్చు లేదా జరిమానా విధించకుండా కాంట్రాక్ట్ వ్యవధిని మూడు నెలల కన్నా తక్కువ మరియు ఆరునెలలకు మించకుండా పొడిగించవచ్చునని వ్యయ శాఖ సూచనలు జారీ చేసింది.  పనితీరు భద్రత విలువను కాంట్రాక్టర్ / సరఫరాదారులకు సరఫరా / సరఫరా పనులకు అనులోమానుపాతంలో మొత్తం కాంట్రాక్ట్ విలువకు తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సూచనలు జారీ చేయబడ్డాయి. వివిధ శాఖలు / మంత్రిత్వ శాఖలు దీనిని అమలు చేస్తున్నాయి.

3.      రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు : 

అపూర్వమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2020-21 సంవత్సరానికి రాష్ట్రాల రుణ పరిమితులను 3 శాతం నుండి 5 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.  దీనివల్ల రాష్ట్రాలకు 4.28 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు వనరులు లభిస్తాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో, ఆదాయ నష్టాల కారణంగా, ప్రస్తుతం ఒత్తిడితో బాధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితికి తోడ్పడే ప్రయత్నంలో భాగంగా, నిర్దిష్ట రాష్ట్ర స్థాయి సంస్కరణల అమలుకు లోబడి 2020-21 ఆర్ధిక సంవత్సరంలో అంచనా వేసిన జి.ఎస్.‌డి.పి. లో 2 శాతం అదనపు రుణాలు తీసుకోవటానికి వ్యయ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కమ్యూనికేషన్ జారీ చేసింది.

4.  ఎం.ఎస్.‌ఎం.ఈ. లతో సహా వ్యాపారాల కోసం 3 లక్షల కోట్ల రూపాయల భాగస్వామ్య రహిత ఆటోమేటిక్ ఋణాలు : 

వ్యాపారానికి సహాయం చేయడం కోసం, 2020 ఫిబ్రవరి 29వ తేదీ నాటికి బకాయి ఉన్న రుణంలో 20 శాతం మేర, అదనపు మూలధన ఋణంగా, రాయితీ వడ్డీ రేటుతో టర్మ్ లోన్ రూపంలో అందించబడుతుంది.  25 కోట్ల రూపాయల వరకు బకాయి ఉండి, 100 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉండి ఎవరి ఖాతాలు ప్రామాణికంగా ఉంటాయో ఆ యూనిట్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.  ఈ యూనిట్లు తమ సొంత హామీ లేదా భాగస్వామ్య హామీ అందించవలసిన అవసరం లేదు.  45 లక్షలకు పైగా ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు మూడు లక్షల కోట్ల రూపాయల మేర మొత్తం లిక్విడిటీ ని కల్పిస్తూ, ఈ మొత్తానికి భారత ప్రభుత్వం 100 శాతం హామీ ఇస్తుంది. 

20.05.2020 తేదీన మంత్రి మండలి ఆమోదం పొందిన తరువాత, ఆర్థిక సేవల విభాగం 23.05.2020 తేదీన ఈ పథకానికి కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది.  అదేవిధంగా, అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పధకం (ఇ.సి.ఎల్.‌జి.ఎస్) నిధి ని 26.05.2020 తేదీన నమోదు చేయడం జరిగింది.  సుమారు ఒకటిన్నర నెలల స్వల్ప వ్యవధిలో యూనిట్లను గుర్తించడం, మంజూరు చేయడంతో పాటు, ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు రుణాలు పంపిణీ చేయడంలో గుర్తించదగిన పురోగతి సాధించడం  జరిగింది. 

2020 జూలై 9వ తేదీ వరకు సాధించిన పురోగతి ఈ విధంగా ఉంది : 

5.      ఎన్.‌బి.ఎఫ్.‌సి. లకు 45,000 కోట్ల రూపాయల పాక్షిక ఋణ హామీ పధకం 2.0 :

తక్కువ రేటులో ఉన్న ఎన్.‌బి.ఎఫ్.‌సి. లు, హెచ్.‌ఎఫ్.‌సి. లు మరియు ఇతర సూక్ష్మ ఆర్ధిక సంస్థలు (ఎం.ఎఫ్.‌ఐ. లు) రుణాలు తీసుకోవడానికి ప్రస్తుత పాక్షిక ఋణ హామీ పథకం (పి.సి.జి.ఎస్) పునరుద్ధరించబడుతుంది మరియు విస్తరించబడుతుంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20 శాతం మొదటి నష్ట సార్వభౌమ హామీని భారత ప్రభుత్వం అందిస్తుంది.

20.05.2020 తేదీన పి.సి.జి.ఎస్.‌పై మంత్రి మండలి ఆమోదం పొందిన వెంటనే, అదే రోజున ఈ పథకానికి కార్యాచరణ మార్గదర్శకాలు కూడా జారీ చేయబడ్డాయి.  14,000 కోట్ల రూపాయల మేర పోర్టుఫోలియో కొనుగోలుకు బ్యాంకులు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం 2020 జులై, 3వ తేదీ నాటికి 6,000 కోట్ల రూపాయలకు ఆమోదం / చర్చల ప్రక్రియలో ఉన్నాయి. 

6.        రైతులకు నాబార్డ్ ద్వారా 30,000 కోట్ల రూపాయల అదనపు అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ సహాయం : 

కోవిడ్-19 సమయంలో, ఆర్.ఆర్.బి. లు మరియు సహకార బ్యాంకులకు, 30,000 కోట్ల రూపాయలతో న్యూ ఫ్రంట్ లోడెడ్ స్పెషల్ రీఫైనాన్స్ సౌకర్యాన్ని, నాబార్డ్ మంజూరు చేసింది.   3 కోట్ల మంది రైతులకు, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా రైతులకు, పంటకోత మరియు ఖరీఫ్ విత్తనాల సమయంలో రుణ అవసరాలు తీర్చడం కోసం ఈ పధకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.  ఖరీఫ్ నాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సదుపాయం కింద 2020 జూలై, 6వ తేదీ వరకు మొత్తం 30,000 కోట్ల రూపాయలలో 24,876.87 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 

7.      టి.డి.ఎస్ / టి.సి.ఎస్. రేటు తగ్గింపు ద్వారా 50,000 కోట్ల రూపాయల లిక్విడిటీ :

రెవెన్యూ శాఖ, 13.05.2020 తేదీ నాటి పత్రికా ప్రకటనలో, నివాసితులకు నిర్ణీత చెల్లింపుల కోసం టి.డి.ఎస్. రేట్లలో  తగ్గింపును ప్రకటించింది. అదేవిధంగా,  2020 మే 14వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు చేసిన లావాదేవీలకు 25 శాతం మేర పేర్కొన్న టి.సి.ఎస్. రేట్లు తగ్గిస్తూ, ప్రకటించింది. 

8.      ఇతర ప్రత్యక్ష పన్ను చర్యలు :

2020 జులై, 3వ తేదీ న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్న విధంగా, ఏప్రిల్ 8వ తేదీ నుండి జూన్ 30 తేదీ మధ్య కాలంలో, 20.44 లక్షలకు పైగా కేసులలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సి.బి.డి.టి) 62,361 కోట్ల రూపాయల మేర పన్నుమొత్తాన్ని తిరిగి చెల్లించింది.   మిగిలిన చెల్లింపులు త్వరలో పంపిణీ చేయనున్నారు.  2019-20 ఆర్ధిక సంవత్సరం (పన్ను మదింపు సంవత్సరం 2020-21) ఆదాయపన్ను రిటర్న్ లు దాఖలు చేయడానికి గడువు తేదీలను పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ 2020 జూన్, 24వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. స్వతంత్ర వ్యక్తులు మొదలైన వారికి ఇంతవరకు 2020 జులై, 31వ తేదీ వరకు ఉన్న గడువు తేదీని,  2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. అదేవిధంగా, కంపెనీలకు ఇంతవరకు 2020 అక్టోబర్, 31వ తేదీ వరకు ఉన్న గడువు తేదీని కూడా 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.  వీటితో పాటు, పన్ను ఆడిట్ నివేదికను సమర్పించాల్సిన గడువును 2020 సెప్టెంబర్ 30వ తేదీ నుండి 2020 అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. 

పరిమితుల ద్వారా మదింపులను నిరోధించే గడువు తేదీని రెవెన్యూ శాఖ 2020 సెప్టెంబర్, 30వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది.  ఈ విషయంలో, 24.6.2020 నాటి పత్రికా ప్రకటన ద్వారా, ‘వివాద్-సే-విశ్వాస్’ పథకం కింద అదనపు మొత్తం లేకుండా చెల్లింపు చేయదానికి గడువు తేదీని 2020 డిసెంబర్ 31వ వరకు పొడిగించినట్లు ఇప్పటికే తెలియజేయబడింది.  వివాద్-సే-విశ్వాస్ చట్టం, 2020 (వి.ఎస్.వి. చట్టం) లో శాసన సవరణలను త్వరలో చెపట్టడం జరుగుతుంది.  ఇంకా, నోటిఫికేషన్ల ద్వారా, 2020 మార్చి 20వ తేదీ నుండి 2020 డిసెంబర్ 30వ తేదీ మధ్యలో వి.ఎస్.వి. చట్టం కింద పేర్కొన్న గడువు తేదీ లన్నింటినీ, 2020 డిసెంబర్ 31వ తేదీకి పొడిగించడం జరిగింది. 

9.      ఐ.బి.సి. సంబంధిత చర్యల ద్వారా సులభతర వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడం :

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐ.బి.సి., 2016 లోని సెక్షన్ 4 కింద ఎగవేత పరిమితిని (ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల నుండి)  ఒక కోటి రూపాయలకు పెంచింది.   అనగా “అప్పులు తీర్చలేని మరియు దివాలా కోడ్, 2016 (2016 యొక్క 31) లోని సెక్షన్ 4 కింద 24.6.2020 తేదీ నాటి నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అధికారాల అమలులో, కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ఒక కోటి రూపాయలను సంబంధిత విభాగం యొక్క ప్రయోజనాల కోసం కనీస బకాయి మొత్తంగా పేర్కొంది” 

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం.ఎస్.ఎం.ఈ. లకు సహాయం చేయడానికి, కోడ్ యొక్క సెక్షన్ 240(ఎ) కింద ప్రత్యేక దివాలా తీర్మానాన్ని ఖరారు చేస్తోంది,  అది త్వరలో తెలియజేయబడుతుంది.

అప్పులు తీర్చలేని మరియు దివాలా కోడ్ (సవరణ) ఆర్డినెన్స్, 2020 జూన్ 5వ తేదీన , 2020 న ప్రకటించబడింది. ఈ కోడ్ యొక్క సెక్షన్ 7, 9 మరియు 10 కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సి.ఐ.ఆర్.పి) ను ఆరు నెలల పాటు లేదా అంతకన్నా ఎక్కువ కాలం,  ఆ తేదీ నుండి ఏడాది కాలం అధిగమించకుండా, తాత్కాలికంగా నిలిపివేయడం కోసం, అప్పులు తీర్చలేని మరియు దివాలా కోడ్ 2016 లో సెక్షన్ 10(ఎ) ను చేర్చడానికి అందించబడింది

10.    ఎన్.‌బి.ఎఫ్.‌సి. లు / హెచ్.‌ఎఫ్.‌సి. లు / ఎం.ఎఫ్.‌ఐ. ల కోసం 30,000 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ పథకం :

ఎన్.‌బి.ఎఫ్.‌సి. / హెచ్‌.ఎఫ్.‌సి. ల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకానికి మంత్రి మండలి ఆమోదం పొందిన తరువాత, ఈ పథకం ప్రారంభించబడింది.  2020 జూలై 7వ తేదీ నాటికి ఈ పధకం కింద, 9,875 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం కోసం ఎస్.బి.ఐ.సి.ఏ.పి. కి 24 దరఖాస్తులు వచ్చాయి. అవి ప్రస్తుతం పరిశీలన స్థాయిలో ఉన్నాయి. వీటిలో మొదటి దరఖాస్తుకు ఆమోదం లభించింది. మిగిలినవి కూడా పరిగణించబడుతున్నాయి.

****



(Release ID: 1638228) Visitor Counter : 567