ప్రధాన మంత్రి కార్యాలయం

750 మెగావాట్ల రేవా సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి


సుమారుగా ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బ‌న్ డైయాక్సెడ్ ఉద్గారాలను త‌గ్గించ‌నున్న రేవా ప్రాజెక్ట్

2022 నాటికి 175 గిగా వాట్ల‌ వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకోవాల‌న్న భారతదేశం యొక్క నిబద్ధతకు ఈ ప్రాజెక్ట్ తార్కాణం

Posted On: 09 JUL 2020 4:11PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ శుక్ర‌వారం (10వ తేదీ) జాతికి అంకితం చేయ‌నున్నారు. సోలార్ పార్క్ (మొత్తం వైశాల్యం 1500 హెక్టార్లు) లోపల ఉన్న 500 హెక్టార్ల విస్తీర్ణంలో 250 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన మూడు సౌర ఉత్పాదక యూనిట్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ సౌర విద్యుత్తు పార్కును మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఎంపీయువీఎన్) జాయింట్ వెంచర్ కంపెనీ రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్‌యుఎంఎస్ఎల్) మరియు కేంద్ర ప్ర‌భుత్వపు అధీనంలోని సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు (ఎస్ఈసీఐ) అభివృద్ధి చేశాయి. ఈ పార్క్ అభివృద్ధి కోసం ఆర్‌ఎంఎస్‌ఎల్‌కు రూ.138 కోట్ల మేర కేంద్ర ఆర్థిక స‌హాయాన్ని మంజూరు చేశారు. ఈ సౌర పార్క్ అభివృద్ధి చేశాక లోప‌ల 250 మెగావాట్ల మూడు సౌర విద్యుత్ ఉత్పాదకత గ‌ల‌ యూనిట్ల అభివృద్ధికి రివర్స్ వేలం ద్వారా మహీంద్రా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎంఈ జైపూర్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌, అరిన్సున్ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎంపిక చేశారు.

చారిత్రాత్మక ఫలితాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చ‌క్క‌ని స‌మ‌న్వితం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించ‌వ‌చ్చ‌నేందుకు రేవా సోలార్ ప్రాజెక్ట్ ఒక మేటి ఉదాహరణ. గ్రిడ్ పారిటీ అడ్డంకి అధిరోహించిన దేశంలో తొలి సౌర ప్రాజెక్టు ఈ రేవా సోలార్ ప్రాజెక్ట్. 2017 తొలినాళ్ల‌లో ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్ట్ టారీఫ్‌తో రూ.4.50 / యూనిట్ పోలిస్తే రేవా ప్రాజెక్ట్ చారిత్రాత్మక ఫలితాలను సాధించింది: మొదటి సంవత్సరం ఈ సంస్థ‌ టారీఫ్ రూ.2.97/ యూనిట్ గాను త‌దుప‌రి 15 సంవ‌త్స‌రాల కాలంలో ఏడాదికి రూ.0.05 / ల‌ యూనిట్ పెంపు ఉండ‌నుంది, 25 సంవత్సరాల కాలానికి పైగా టారీఫ్ రూ. 3.30/ యూనిట్‌గా ఉండ‌నుంది. ఈ ప్రాజెక్ట్ సుమారుగా ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బ‌న్ డైయాక్సెడ్ ఉద్గారాలను త‌గ్గించ‌నుంది. బలమైన ప్రాజెక్ట్ నిర్మాణం మరియు ఆవిష్కరణలకు ప్ర‌తీక‌గా రేవా ప్రాజెక్ట్ భారతదేశం మరియు విదేశాలలో గుర్తించబడింది. విద్యుత్ డెవలపర్‌లకు నష్టాలను తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్‌లో పాటిస్తున్న‌ చెల్లింపు భద్రతా విధానం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా ఎంఎన్ఆర్ఈ సిఫార‌సు చేసింది.

24 శాతం మేర విద్యుత్‌ ఢిల్లీ మెట్రోకు ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత విష‌య‌మై ఈ ప్రాజెక్ట్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అవార్డును కూడా పొందింది. ప్రధాన మంత్రి యొక్క ఎ బుక్ ఆఫ్ ఇన్నోవేషన్: న్యూ బిగినింగ్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ప్ర‌స్తావించారు.. వ్య‌వ‌స్థాపిత రాష్ట్రానికి వెలుపల సంస్థాగత వినియోగ‌దారుల‌కు విద్యుత్ సరఫరా చేస్తున్న‌ మొదటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌గా కూడా ఇది నిలువ‌నుంది. ఈ ప్రాజెక్ట్ నుండి దాదాపు 24 శాతం మేర విద్యుత్‌ను ఢిల్లీ మెట్రో పొంద‌నుంది. మిగ‌తా 76 శాతం విద్యుత్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర డిస్కం సంస్థ‌ల‌కు సరఫరా చేయబడుతుంది. 2022 నాటికి 100 గిగావాట్ల మేర సామ‌ర్థ్య‌పు సౌర విద్యుత్‌తో పాటు 175 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధనపు సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశం యొక్క నిబద్ధతకు ఈ రేవా ప్రాజెక్ట్ ఒక తార్కాణంగా నిలువ‌నుంది.

*******


(Release ID: 1637589) Visitor Counter : 362