మంత్రిమండలి

మూడు ప్ర‌భుత్వ రంగ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ సంస్థ‌లకు రూ.12,450 కోట్ల మేర మూల‌ధ‌న సాయం అందించేందుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ల‌లో ప్ర‌భుత్వ క్యాపిటల్ ఇన్‌ఫ్యూజ‌‌న్‌

Posted On: 08 JUL 2020 4:25PM by PIB Hyderabad

మూడు ప్ర‌భుత్వ రంగ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీల‌కు (పీఎస్‌జీఐసీ) మొత్తం రూ.12,450 కోట్ల మేర మూలధన సాయం అందించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన స‌మావేశ‌మైన‌ కేంద్ర మంత్రివర్గం త‌న ఆమోదాన్ని తెలిపింది. 2019-20 సంవత్సరంలో జ‌రిపిన రూ.2,500 కోట్ల మేర క్యాపిట‌ల్ ఇన్‌ఫ్యూజ‌న్‌ను క‌లుపుకొని కేంద్రం ఈ 3 పీఎస్‌జీఐసీల‌కు మూల‌ధ‌న సాయం అందించనుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఈ మూల‌ధ‌న సాయం అందించ‌నున్న సంస్థ‌ల‌లో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐ‌సీఎల్), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్) మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యుఐఐసీఎల్) వంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. క్యాబినెట్ ఆమోదించిన క్యాపిట‌ల్ ఇన్‌ఫ్యూజ‌న్‌లో రూ. 3,475 కోట్ల నిధుల వెంటనే విడుదల చేయబడతాయి; మిగిలిన రూ.6475 కోట్లు తరువాత విడుద‌ల చేయ‌నున్నారు. మూలధన ఇన్‌ఫ్యూజ‌న్‌ను ప్రభావితం చేయడానికి గాను ఎన్‌ఐసీఎల్ యొక్క అధీకృత వాటా మూలధనాన్ని రూ.7,500 కోట్లకు, యుఐఐసీఎల్, ఓఐసీఎల్ సంస్థ‌ల అధీకృత వాటా మూల‌ధ‌నాన్ని రూ.5,000 కోట్లకు పెంచడానికి క్యాబినెట్ త‌న ఆమోదాన్ని తెలిపింది. ప్రస్తుత దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకుని విలీన ప్రక్రియ ఇప్పటికి నిలిపివేయబడింది దీనికి బ‌దులు ఆయా సంస్థ‌ల లాభదాయకత‌ వృద్ధిపై దృష్టి సారించ‌డ‌మైంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలివిడుత‌గా మూడు పీఎస్‌జీఐసీలైన ఎన్ఐసీఎల్‌, యూఐఐసీ, ఓఐసీఎల్ సంస్థ‌ల‌కు రూ.3,475 కోట్ల మేర మూలధన ఇన్‌ఫ్యూజ‌న్ చేయ‌నున్నారు. మిగతా మొత్తం సొమ్మును వివిధ విడుత‌ల‌లో ఆయా సంస్థ‌ల‌కు అందించ‌నున్నారు. మూలధన ఇన్‌ఫ్యూజ‌న్‌ ప్రభావాన్ని ప్ర‌తిబింబించేందుకు గాను ఎన్‌ఐసీఎల్ యొక్క అధీకృత వాటా మూలధనాన్ని రూ.7,500 కోట్లకు, యుఐఐసీఎల్, ఓఐ‌సీఎల్ అధీకృత వాటా మూల‌ధ‌నాన్ని రూ.5,000 కోట్ల మేర పెంచ‌నున్నారు.

ప్ర‌భావం:

మూలధన సాయం మూడు పీఎస్‌జీఐసీలకు వారి ఆర్థిక మరియు ప‌ర‌ప‌తి స్థితిని మెరుగుపరచుకోవ‌డానికి, ఆర్థిక వ్యవస్థ బీమా అవసరాలను తీర్చడానికి, త‌గిన‌ మార్పులను గ్రహించి, వనరులను పెంచే సామర్థ్యాన్ని, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుచుకొనేందుకు దోహ‌దం చేయ‌నుంది.

ఆర్థిక అంత‌స్సూచ‌న‌:

మూలధన ఇన్‌ఫ్యూజ‌న్‌ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎన్ఐసీఎల్‌, యూఐఐసీ, ఓఐసీఎల్ సాధార‌ణ బీమా సంస్థ‌ల‌కు తక్షణం ఆర్థిక వెసులుబాటుగా రూ.3,475 కోట్ల మేర నిధులు మొద‌టి విడుత‌గా అంద‌నున్నాయి. ఆ త‌రువాత రూ.6,475 కోట్ల మేర నిధులు అందుతాయి.

ముందున్న మార్గం:

కేంద్రం ద్వారా అందించబడుతున్న మూలధన సాయం యొక్క వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారించడానికి, వ్యాపార సామర్థ్యం మరియు లాభదాయక వృద్ధిని తీసుకురావ‌డానికి గాను ప్రభుత్వం కేపీఐల రూపంలో త‌గిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత దృష్టాంతాన‌ బీమా సంస్థ‌ల విలీన ప్రక్రియ ఇప్పటికైతే నిలిపి వేయబడింది మ‌రియు దీనికి బదులుగా మూలధ‌న సాయం అందించాక ప‌ర‌ప‌తి మరియు లాభదాయక వృద్ధిపై దృష్టి సారించ‌నున్నారు.

*****



(Release ID: 1637411) Visitor Counter : 214