సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

చలన చిత్ర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ఎస్.ఓ.పి. ‌లను ప్రకటించనుంది - ప్రకాష్ జవదేకర్


Posted On: 07 JUL 2020 6:05PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న అన్ ‌లాక్ దశలో చిత్ర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడాన్ని వేగవంతం చేయడానికి వీలుగా ప్రభుత్వం త్వరలో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను జారీ చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.  కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన చలన చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించడానికి వీలుగా, మేము టీవీ సీరియల్స్, ఫిల్మ్ మేకింగ్, కో-ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్‌ లతో సహా అన్ని రంగాలలో తగిన ఉత్పత్తి ప్రోత్సాహకాలతో ముందుకు వస్తున్నాము.  మేము త్వరలో ఈ చర్యలను ప్రకటిస్తాము" అని ఫిక్కీ ఫ్రేమ్స్ యొక్క 21 వ ఎడిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్రీ జవదేకర్ పేర్కొన్నారు.

కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, మీడియా మరియు వినోద రంగ పరిశ్రమ వార్షిక సమావేశం-2020 ఎప్పుడు నిర్వహించే ముంబైలోని పోవై సరస్సు ప్రదేశానికి బదులుగా ఆన్ లైన్ పద్ధతిలో జరిగింది.

"సమాచారాన్ని ఇతరులకు అందజేయడానికి కొత్త మార్గాల గురించి ఆలోచించే విధంగా కోవిడ్ మహమ్మారి ప్రజలను ప్రేరేపిస్తోంది. దీంతో, నూతనంగా ప్రారంభించిన ఆన్ లైన్ సమావేశాలు అతి సాధారణంగా మారాయి, అయితే, ఈ సందర్భంగా ఏర్పడిన భాగస్వామ్యాలు మాత్రం వాస్తవంగానే కొనసాగుతున్నాయి".  అని మంత్రి వ్యాఖ్యానించారు.  విషయాన్ని సృష్టించడంలో భారత్ భారీ వ్యయ ప్రయోజనాన్ని పొందుతోందనీ, ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు భారతీయ విషయ పరిజ్ఞానం వైపే దృష్టి సారిస్తున్నాయనీ, ఆయన అన్నారు.  భారతదేశం యొక్క మృదువైన శక్తి -  మీడియా మరియు వినోద రంగం అభివృద్ధి చెంది, పురోగతి సాధించడానికి భాగస్వాములందరూ  కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలకోపన్యాసం చేస్తూ, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని మార్చడంలో సృజనాత్మక పరిశ్రమకు ముఖ్యమైన పాత్ర ఉందనీ, వాల్యూమ్ నుండి, దృష్టి విలువ సృష్టికి మారాలనీ, పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంకేతిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ, చిత్రాలలో, ప్రభుత్వం సదుపాయాలు కల్పించే పాత్రను పోషించాలనీ, "తక్కువ నియంత్రణను నిర్ధారించడానికి వివిధ నియంత్రణ వ్యవస్థలను సమన్వయ పరచాలనీ, సూచించారు. మీడియా మరియు వినోద పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, కొన్ని అంశాలను చక్కగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని శ్రీ ఖరే అన్నారు.

నీతి అయోగ్ సీ.ఈ.ఓ. అమితాబ్ కాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చవచ్చనీ, భారతదేశం 12 - 13 పురోగమ రంగాలను గుర్తించాలని, ఇందులో స్థిరమైన అధిక వృద్ధిని సాధించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగడానికి ప్రయత్నించవచ్చునని సూచించారు.  ఈ రంగాలలో మీడియా మరియు వినోదరంగం కూడా ఒకటి అని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ఈ పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి, స్టార్ అండ్ డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో మీడియా మరియు వినోద రంగం ఒక ముఖ్యమైన భాగం. ఇది ఉద్యోగాలు మరియు వ్యాపారాలను సృష్టించగలదు మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రకాశవంతం చేస్తుంది ”, అని పేర్కొన్నారు.  ఏదేమైనా, భారతీయ మీడియా పరిశ్రమ, ముఖ్యంగా ప్రింట్, టివి మరియు డిజిటల్ ప్రకటనల ఆదాయంపై అసమానంగా ఆధారపడి ఉందని ఆయన విలపించారు మరియు ఈ ఏర్పాటు పెద్ద ఎదురుదెబ్బ అని కోవిడ్ మహమ్మారి నిరూపించిందని ఆయన అన్నారు.  "పరిశ్రమ వృద్ధి చెందాలంటే, అది ప్రకటనపై ఆధారపడటం అవసరం" అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

గూగుల్ సంస్థకు చెందిన సంజయ్ గుప్తా మాట్లాడుతూదేశంలో మీడియా మరియు వినోద పరిశ్రమకు కోవిడ్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి వివరించారు.  2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగం 20 బిలియన్ డాలర్ల నుండి 15 బిలియన్ డాలర్లకు తగ్గే అవకాశం ఉందనీ, అయితే, తిరిగి సృజనాత్మక శక్తి కేంద్రంగాపునరుద్ధరించబడే సామర్థ్యం ఈ రంగానికి ఉంది.  పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలని మరియు పరిశ్రమ దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోడానికి తేలికపాటి నియంత్రణ విధానాన్ని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు.

జూలై 11వ తేదీ వరకు కొనసాగే  ఫిక్కీ ఫ్రేమ్స్ ఆన్ లైన్ సమావేశాల్లో మీడియా మరియు వినోద రంగంలోని వివిధ అంశాలపై పరిశ్రమకు చెందిన నిపుణులు, తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటారు.  ఫిక్కీ-ఫ్రేమ్స్-2020 సదస్సుకు ఇటలీ కేంద్ర దేశంగా ఉంది.

----------

 


(Release ID: 1637068) Visitor Counter : 241