ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


జాతీయ కోవిడ్ పాజిటివ్ శాతం 6.73% అనేక రాష్ట్రాల్లో తక్కువ శాతమే

కేంద్రం చర్యల ఫలితంగా ఢిల్లీలో పెరిగిన పరీక్షలు, తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు

Posted On: 06 JUL 2020 2:53PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఉమ్మడి కృషిలో భాగంగా కేంద్రం పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. బాధితుల గుర్తింపు కోసం గాలించటం ద్వారా సకాలంలో చికిత్స అందించటం సాధ్యమవుతుంది. కేంద్ర సాయం వలన రాష్ట్రాలు కూడా పరీక్షల సంఖ్య బాగా పెంచింది. దీనివలన పాజిటివ్ కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పాజిటివ్ లు 6.73% నమోదైంది.

జులై 5 నాటికి జాతీయ స్థాయి కంటే తక్కువగా వివిధ రాష్ట్రాలలో నమోదైన పాజిటివ్ ల సంఖ్య ఇలా ఉంది.

క్రమ సంఖ్య

రాష్ట్రం

పాజిటివ్ శాతం

పది లక్షలకు పరీక్షలు

1

భారత్ ( జాతీయం)

6.73

6,859

2

పాండిచ్చేరి

5.55

12,592

3

చండీగఢ్

4.36

9,090

4

అస్సాం

2.84

9,987

5

త్రిపుర

2.72

10,941

6

కర్నాటక

2.64

9,803

7

రాజస్థాన్

2.51

10,445

8

గోవా

2.5

44,129

9

పంజాబ్

1.92

10,257

 

ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం చర్యలకు అదనంగా కేంద్రం కూడా కృషి చేయటం వలన పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్ టి ఐ - పిసిఆర్ పరీక్షలకు తోడు కొత్తగా రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ పరీక్షల వలన కేవలం అరగంటలోనే ఫలితాలు వస్తాయి.

ఫలితంగా రోజుకు జరిపే పరీక్షల సంఖ్య సగటున 5481 ఉండగా ఇప్పుడు అది రోజుకు 18,766 శాంపిల్స్ కు చేరింది. ఇలా గణనీయంగా పరీక్షలు పెరిగినప్పటికీ పాజిటివ్ ల శాతం  30%  నుంచి 10% కు తగ్గింది.

***



(Release ID: 1636843) Visitor Counter : 230