ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
4 లక్షలు దాటిన కోవిడ్ నుంచి కోలుకున్న వారు
చికిత్సలో ఉన్న బాధితులకంటే 1.65 లక్షలు అధికం
Posted On:
05 JUL 2020 1:43PM by PIB Hyderabad
కోవిడ్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఈ రోజుకు 4,09,082 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 14,856 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం కోవిడ్ తో చికిత్స పొందుతున్నవారి కంటే కోలుకున్నవారే 1,64,268 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 60.77% కు చేరినట్టయింది.
ప్రస్తుతం ఇంకా 2,44,814 మంది బాధితులుండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.
జాతీయ సగటు కంటే ఎక్కువగా కోలుకున్నశాతం నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు 21 ఉన్నాయి. వాటి జాబితా ఇలా ఉంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం
|
కోలుకున్నవారి శాతం
|
1
|
చండీగఢ్
|
85.9%
|
2
|
లద్దాఖ్
|
82.2%
|
3
|
ఉత్తరాఖండ్
|
80.9%
|
4
|
చత్తీస్ గఢ్
|
80.6%
|
5
|
రాజస్థాన్
|
80.1%
|
6
|
మిజోరం
|
79.3%
|
7
|
త్రిపుర
|
77.7%
|
8
|
మధ్య ప్రదేశ్
|
76.9%
|
9
|
జార్ఖండ్
|
74.3%
|
10
|
బీహార్
|
74.2%
|
11
|
హర్యానా
|
74.1%
|
12
|
గుజరాత్
|
71.9%
|
13
|
పంజాబ్
|
70.5%
|
14
|
ఢిల్లీ
|
70.2%
|
15
|
మేఘాలయ
|
69.4%
|
16
|
ఒడిశా
|
69.0%
|
17
|
ఉత్తరప్రదేశ్
|
68.4%
|
18
|
హిమాచల్ ప్రదేశ్
|
67.3%
|
19
|
పశ్చిమ బెంగాల్
|
66.7%
|
20
|
అస్సాం
|
62.4%
|
21
|
జమ్మూ కాశ్మీర్
|
62.4%
|
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది. దీంతో రోజూ లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1100 కు చేరింది. వీటిలో 786 ప్రభుత్వ లాబ్ లు, 314 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది:
- తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 591 (ప్రభుత్వ: 368 + ప్రైవేట్: 223)
- ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 417(ప్రభుత్వ: 385 + ప్రైవేట్: 32)
- సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 92 (ప్రభుత్వ: 33 + ప్రైవేట్: 59)
పరీక్షలు, గుర్తింపు, చికిత్స అనే వ్యూహంలో భాగంగా ప్రజలకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కోవిడ్ పరీక్షలకు ఎదురవుతున్న అనేక ప్రతిబంధకాలను తొలగించారు. దీంతో ప్రతిరోజూ పరీక్షల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,48,934 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన పరీక్షల సంఖ్య 97,89,066కు చేరింది.
సాధారణ, మానసిక వైద్య సేవల మార్గదర్శన పత్రం పేరిట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన వివరాలను ఈ దిగువ లింక్ లో చూడవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/MentalHealthIssuesCOVID19NIMHANS.pdf
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1636650)
Visitor Counter : 247
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam