ప్రధాన మంత్రి కార్యాలయం

భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రగతిని సమీక్షించిన - ప్రధానమంత్రి

Posted On: 04 JUL 2020 6:14PM by PIB Hyderabad

భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ మరియు విద్య పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, రెండు శాఖల సహాయ మంత్రులూ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులతో పాటు, వ్యవసాయ, పశుసంవర్ధక మరియు పాడి, మత్స్య శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ మరియు వ్యవసాయ పరిశోధన, విస్తరణ విభాగం కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర వివిధ సవాళ్ళను ఎదుర్కోడానికి వీలుగా ప్రాధాన్యతలు, పనితీరు, సంసిద్ధతలను వివరించారు.   2014 నుండి, ఐ.సి.ఎ.ఆర్. కు చెందిన వివిధ కేంద్రాలలో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా, కొత్త రకాల క్షేత్ర పంటలు (1434), ఉద్యాన పంటలు (462) మరియు వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలు (1121) అభివృద్ధి చేయబడ్డాయి.  బహుళ ఒత్తిడిని తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి పరమాణు విధానాలను కూడా  ఉపయోగించడం జరిగింది.  హెచ్.డి. 3226 అనే గోధుమ రకం ఏడు వ్యాధులను తట్టుకుంటుంది. అదేవిధంగా అర్క్ అబెడ్ అనే టొమాటో నాలుగు వ్యాధులను తట్టుకునే శక్తి కలిగి ఉంది.

ప్రాసెసింగ్ లక్షణాలతో వాణిజ్య ప్రాసెసింగ్ వెరిటీల అవసరాన్ని తీర్చడం కోసం అర్క్ ‌వైజెస్, అర్క్‌ అలేషా, అర్క్‌యోజి వంటి రకాలను అభివృద్ధి చేయబడింది.  వ్యవసాయ-వాతావరణ మండలాల యొక్క నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారించే రకాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.  రైతులకు మెరుగైన రాబడినిచ్చేలా ముందుకు మరియు వెనుకబడిన అనుసంధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

కరణ్-4 అనే చెరకు రకం చక్కెర రికవరీని మెరుగుపరిచింది. ఉత్తర ప్రదేశ్‌లో సాంప్రదాయకంగా పండించే రకాలను ఇది భర్తీ చేసింది.  చెరకు మరియు ఇతర పంటల నుండి బయో ఇథనాల్ ఉత్పత్తిని పెంచే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

కుపోష్ ముక్త్ భారత్’ (పోషకాహార లోపం లేని భారతదేశం) ను సాధించే ప్రయత్నంలో భాగంగా మెరుగైన ఐరన్, జింక్ మరియు ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే 70 జీవావరణ రకాలను అభివృద్ధి చేయడం జరిగింది.  భాగ్వా అనే దానిమ్మ పండు రకంలో  ఐరన్, పొటాషియం, విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా పోషణ్ థాలి (పౌష్టికాహార భోజనం) మరియు న్యూట్రీ గార్డెన్స్ (పౌష్టికాహార తోటలు) ప్రచారం చేయబడుతున్నాయి.  మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌ గఢ్ లలో  76 కృషి విజ్ఞాన కేంద్రాలు, 450 నమూనా వ్యవసాయ క్షేత్రాలతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు.  అంగన్వాడీ కార్మికులు మరియు గ్రామీణ ప్రాంతాల మహిళలకు సమతుల్య ఆహారం ఉండేలా న్యూట్రియా-గార్డెన్స్ పెంచడానికి శిక్షణ ఇస్తున్నారు.  పోషణ్ థాలి లో అన్నం, స్థానికంగా పండించే పప్పు, కాలానుగుణంగా లభించే ఒక పండు, ఆకుకూరలు, దుంపలు, ఇతర కూరగాయలు, పాలతో పాటు చక్కెర, బెల్లం, నూనెలు వంటి ఇతర పదార్ధాలు ఉంటాయి.  2022 నాటికి 100 న్యూట్రీ స్మార్ట్ గ్రామాలను రూపొందించనున్నారు.

క్లస్టర్ ఆధారిత విధానం పై సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ఐ.సి.ఎ.ఆర్. భౌగోళికంగా సూచించి, అభివృద్ధి చేసిన భారత సేంద్రీయ కార్బన్ మ్యాప్‌, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించదానికి అనుకూలమైన 88 బయోకంట్రోల్ ఏజెంట్లు మరియు 22 బయో పురుగుమందులను గుర్తించింది.

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవిష్కరణ మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి అంకురా సంస్థలు మరియు వ్యవసాయ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఆదేశించారు.  రైతులకు వారు కోరుకున్న సమాచారం అందించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

వ్యవసాయ కార్మికులలో అధిక సంఖ్యలో  మహిళా కార్మికులే ఉన్న కారణంగా, గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు వ్యవసాయ కార్యకలాపాలలో దుర్వినియోగాన్ని తగ్గించగల సాధనాలు మరియు సామగ్రి కోసం డిజైన్ అవసరాలను తీర్చడానికి సంవత్సరానికి రెండుసార్లు హాకథాన్‌లను నిర్వహించవచ్చని ఆయన ఆదేశించారు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్ధారించడానికి జొన్నలు, సజ్జలు, రాగి మరియు అనేక ఇతర చిన్న తృణ ధాన్యాలను ఆహారంలో చేర్చడం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

వడ గాడ్పులు, కరువులు, చలి గాలులు, భారీ వర్షాల వల్ల పంటలు మునిగిపోవడం వంటి వాతావరణ మార్పుల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలు సంభవిస్తాయి, తద్వారా వ్యవసాయ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుంది.   ఇటువంటి వాతావరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాల నుండి రైతులను రక్షించడానికి సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు అభివృద్ధి చేయబడ్డాయి.  తరతరాలుగా రైతులు పండించే సాంప్రదాయ రకాలు ఒత్తిడి సహనం మరియు ఇతర అనుకూల లక్షణాల కోసం పరీక్షించబడుతున్నాయి.

నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, అవగాహన మరియు అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంత్రి కోరారు.  పశువులు, గొర్రెలు, మేకల కొత్త జాతులను అభివృద్ధి చేయడంలో ఐ.సి.ఎ.ఆర్. యొక్క సహకారాన్ని సమీక్షించినప్పుడు ప్రధానమంత్రి మాట్లాడుతూ, కుక్కలు, గుర్రాల స్వదేశీ జాతులపై కూడా  పరిశోధన చేయవలసిన అవసరం ఉందని అన్నారు.  పశువుల్లో కాళ్ళు మరియు నోటి వ్యాధులు ప్రబలకుండా  టీకాలు వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

గడ్డి మరియు స్థానిక పశుగ్రాస పంటల పోషక విలువను అర్థం చేసుకోవడానికి, వాటి అధ్యయనం చేపట్టాలని ప్రధానమంత్రి ఉపదేశించారు.  న్యూట్రాస్యూటికల్స్‌లో వాణిజ్య పద్దతులను అన్వేషించదాంతో పాటు, మట్టి ఆరోగ్యంపై వాటి ప్రభావం కోసం సముద్రపు కలుపు మొక్కల వాడకాన్ని అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

వరి పంట కోసిన తరువాత మోడులను తగులబెట్టే సమస్యను పరిష్కరించడానికి ఐ.సి.ఎ.ఆర్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ లలో మ్యాజిక్ సీడర్‌ను ప్రవేశపెట్టింది.  2016 తో పోల్చితే 2019 లో ఈ తగులబెట్టే సమస్య 52 శాతం తగ్గింది.

వ్యవసాయ పరికరాలు అదేవిధంగా వ్యవసాయ క్షేత్రం నుండి మార్కెట్ల కు రవాణా సౌకర్యం రైతులకు సులువుగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రధానమంత్రి ఆదేశించారు.  దీనికి సంబంధించి వ్యవసాయం, సహకార సంఘాలు, రైతు సంక్షేమ శాఖ "కిసాన్ రథ్"  అనే యాప్ ‌ను ప్రారంభించింది.

రైతుల డిమాండ్లను తీర్చడానికి వ్యవసాయ వాతావరణ అవసరాల ఆధారంగా వ్యవసాయ విద్యా, పరిశోధనా వ్యవస్థలను అవగతం చేయవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి ఎత్తిచూపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ వ్యవస్థలు సన్నద్ధం కావలసిన అవసరం ఉంది.

గ్రామీణ ప్రాంతాలను మార్చడంలో భారతీయ వ్యవసాయం యొక్క పూర్తి సామర్థ్యాన్ని అమలుచేయడానికి భారతీయ సమాజాల యొక్క సాంప్రదాయిక విజ్ఞానం, యువత మరియు వ్యవసాయ పట్టభద్రుల సాంకేతికత, నైపుణ్యాలతో కలిసి ఉండాలని ప్రధానమంత్రి ప్రోత్సహించారు.

*****



(Release ID: 1636584) Visitor Counter : 415