ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు లక్షా 60 వేలు అధికం
కోలుకుంటున్నవారు 60.81%
పరీక్షించిన శాపిల్స్ 95 లక్షల పైమాటే
Posted On:
04 JUL 2020 5:10PM by PIB Hyderabad
కోవిడ్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి
ప్రస్తుతం కోవిడ్ కు చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారే 1,58,793 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 60.81% కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 14,335 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,94,226 కు చేరింది.
ప్రస్తుతం ఇంకా 2,35,433 మంది బాధితులుండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది. దీంతో రోజూ లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1087 కు చేరింది. వీటిలో 780 ప్రభుత్వ లాబ్ లు, 307 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
- తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 584(ప్రభుత్వ: 366 + ప్రైవేట్: 218)
- ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 412 (ప్రభుత్వ: 381 + ప్రైవేట్: 31)
- సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 91 (ప్రభుత్వ: 33 + ప్రైవేట్: 58)
పరీక్షలు, గుర్తింపు, చికిత్స అనే వ్యూహంలో భాగంగా ప్రజలకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అమ్దులో భాగంగానే కోవిడ్ పరీక్షలకు ఎదురవుతున్న అనేక ప్రతిబంధకాలను తొలగించారు. దీంతో ప్రతిరోజూ పరీక్షల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటిదాకా 90 లక్షలకు పైగా శాంపిల్స్ కు పరీక్షలు జరిపారు. గడిచిన 24 గంటల్లో 2,42,383 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన పరీక్షల సంఖ్య 95,40,132 కు చేరింది.
కోవిడ్-19 చికిత్సాపరమైన నిర్వహణ విధివిధానాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్పులు, చేర్పులతో తాజాగా రూపొందించింది. తాజా సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైట్ చిరునామాలో చూడవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/UpdatedClinicalManagementProtocolforCOVID19dated03072020.pdf
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1636496)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam