ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సామాజిక ఆరోగ్య కార్యకర్త స్ఫూర్తిని చాటిన కర్నాటక ఆశా కార్యకర్తలు


వ్యాధి సోకే అవకాశమున్న1.59 కోట్ల ఇళ్ళను సర్వే చేసిన 42000 మంది ఆశాలు

Posted On: 03 JUL 2020 2:08PM by PIB Hyderabad

కర్నాటకలోని శివమొగ్గ జిల్లా తుంగానగర్ లో ఆసా కార్యకర్త అన్నపూర్ణ. ఆమెకింద మురికివాడల్లో నివసించే 3000 మంది జనాభా ఉన్నారు.  నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేసిన 2015నుంచి నుంచి ఆమె అక్కడ పనిచేస్తూ ఉంది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆమెకు అప్పగించిన పనుల్లో ఒకటి ఇంటింటి సర్వే చేపట్టటం.

కర్నాటక రాష్ట్రం కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోవటంలో 42,000 మంది ఆశా కార్యకర్తలు మూల స్తంభాల్లా నిలిచారు.  ఇంటింటికీ తిరిగి సర్వే చేయటంలోని, అంతర్రాష్ట్ర ప్రయాణీకులను పరీక్షించటంలోను, వలస కార్మికులకు పరీక్షలు జరపటంలోను వైరస్  సోకినవారిని ప్రాథమిఒకంగా గుర్తించటంలోను వాళ్ళు కీలకపాత్ర పోషించారు. సులువుగా కరోనా వైరస్ సోకే అవకాశమున్నవారిని గుర్తించటానికి ఇంటింటికీ వెళ్ళి వృద్ధులను, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిని రోజుకు ఒకసారైనా క్రమం తప్పకుండా కలుసుకుంటూ పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా కంటెయిన్మెంట్ జోన్లలోనూ రోజుకోసారి, మిగిలిన ప్రాంతాల్లో కనీసం 15 రోజులకొకసారి వెళ్ళి అక్కడి పరిస్థితిని బేరీజు వేశారు. ఇతర వైరస్ సంబంధ వ్యాధులున్నవారు ఏవైనా ఫిర్యాదులు చేస్తే వారిని కలుసుకోవటం, రిస్క్ మరీ ఎక్కువ ఉన్నవారి సమాచారం రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయటంలో ఏ మాత్రమూ ఆలస్యం చేయలేదు.

కోవిడ్ తోబాటు కోవిడేతర సేవల విషయంలోనూ గ్రామ పంచాయితీ స్థాయిలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో  కృషి చేసే పంచాయిత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ నాయకత్వంలోని టాస్క్ ఫోర్స్ లో వీరు భాగస్వాములు కావటం విశేషం. పట్టణ ప్రాంతాల్లోని ఆశా కార్యకర్తలు జ్వర చికిత్సాలయాల్లోను, స్వాబ్ సేకరణ కేంద్రాల్లోను విశేషమైన పాత్ర పోషించారు. ఇతర వైరస్ సంబంధ రోగులకు పరీక్షలు నిర్వహించటంలో ముందుండటమే కాకుండా అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర పరీక్షలు జరపటానికి కూడా సేవలందించారు.

కర్నాటకలో కొన్ని దృశ్యాలు: కోవిడ్ మీద పోరులో ఆశా కార్యకర్తలు


(Release ID: 1636195) Visitor Counter : 329