ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం



తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలకు కేంద్ర బృందాలు


75 లక్షలు పైబడ్డ మొత్తం పరీక్షలు కోలుకున్నవారి శాతం 57.43%

Posted On: 25 JUN 2020 2:51PM by PIB Hyderabad

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ నేత్రుత్వంలోని కేంద్ర బృందం ఈ నెల 26-29 మధ్య తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యతించబోతోంది. ఈ బృందం ఈ మూడు రాష్ట్రాల అధికారులలో సమాలోచనలు జరిపి కోవిడ్ నివారణ చర్యలు అమలు జరుగుతున్న తీరుతెన్నులను బలోపేతం చేయటానికి అవసరమైన సమన్వయాన్ని సాధిస్తుంది.

వ్యాధి నిర్థారణ పరీక్షాకేంద్రాల సంఖ్య పెరుగుతున్నదనటానికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా మొత్తం లాబ్ ల సంఖ్య 1007  కి చేరింది. వాటిలో ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు  734 కి  చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 273  కి పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 559 (ప్రభుత్వ: 359  + ప్రైవేట్:  200)

ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 364 (ప్రభుత్వ: 343 + ప్రైవేట్: 21)

సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 84 (ప్రభుత్వ: 32  + ప్రైవేట్: 52)

2020 జనవరి లో పరిమితంగా మొదకైన కోవిడ్ పరీక్షలు ఇప్పుడు గత 24 గంటల్లోనే 2,07,871 పరీక్షలు జరిపే స్థాయికి వచ్చింది. దీంతో ఇప్పుడు మొత్తం పరీక్షలు 75 లక్షలు దాటి 75,60,782కు చేరింది.

కోవిడ్-19  నుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.  బాధితులలో కోలుకున్నవారి శాతం 57.43% కు చేరింది.  ఇప్పటివరకు 2,71,696 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 13,012 మంది కోవిడ్-19  బాధితులు  కోలుకున్నారు.

 

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,86,514 . వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి లక్షమందికి నమోదైన కేసుల సంఖ్య 33.39 కాగా ప్రపంచ స్థాయిలో అది లక్షకు 120.21 గా నమోదైంది. ఇక మరణాల విషయానికొస్తే ప్రపంచ సగటు లక్షకు 6.24  కాగా, భారత్ లో అత్యల్పంగా 1.06 గా నమోదైంది

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి


(Release ID: 1634333) Visitor Counter : 234