ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
ప్రతి లక్ష జనాభాలో కోవిడ్ కేసుల సంఖ్య భారత్ లో అత్యల్పం: కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం పెరుగుదల
Posted On:
22 JUN 2020 1:12PM by PIB Hyderabad
జూన్ 21న ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి లక్షమంది జనాభాకూ నమోదైన కోవి డ్ కేసుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశమైనప్పటికీ లక్షమందిలో 30.04 మంది మాత్రమే కోవిడ్ బారిన పడగా అంతర్జాతీయంగా అది మూడు రెట్లు అధికంగా 114.67 మందిగా నమోదైంది. అమెరికాలో లక్షమందికి 671.24 మంది, జర్మనీ, స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో వరుసగా 583.88 మంది, 526.22 మంది, 489.42 మంది చొప్పున కరోనా బారినపడ్డారు.
ఇలా భారత్ లో కోవిడ్ కేసులు తక్కువగా ఉండటానికి కారణం ఇక్కడ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, గుర్తించటానికి పరీక్షలు జరపటం, చికిత్స చేయటం, నివారించటంలో కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన సానుకూల విధానమే కారణం.
కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 2,37,195 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 9,440 మంది కోవిడ్-19 బాధితులు కోలుకున్నారు. బాధితులలో కోలుకున్నవారి శాతం 55.77% కు పెరిగింది.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,74,387 . వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కోలుకున్నకోవిడ్ బాధితులకు, ఇంకా చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్యకూ మధ్య అంతరం క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ క్రింది గ్రాఫ్ లో ఆ విషయం స్పష్టంగా చూడవచ్చు. ఈ రోజు కోలుకున్నవారి సంఖ్య చికిత్సపొమ్దుతూ ఉన్నవారి సంఖ్య కంటే 62,808 అధికంగా నమోదైంది.
కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) పెంచుతూ వస్తోంది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 723 కి చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 262 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 985 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 549 (ప్రభుత్వ: 354 + ప్రైవేట్: 195)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 359 (ప్రభుత్వ: 341 + ప్రైవేట్: 18)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 77 (ప్రభుత్వ: 28 + ప్రైవేట్: 49)
పరీక్షలు జరుపుతున్న శాంపిల్స్ సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,43,267 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 69,50,493 కు చేరింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1633337)
Visitor Counter : 311
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam