ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
49.95 కు చేరిన కోలుకున్నవారి శాతం
Posted On:
13 JUN 2020 4:26PM by PIB Hyderabad
గడిచిన 24 గంటల్లో మొత్తం 7,135 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,54,329 కు చేరింది. బాధితులలో కోలుకున్నవారి శాతం 49.95% గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,45,779. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) మరింత పెంచింది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 642 కి చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 243 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 885 అయింది. గడిచిన 24 గంటల్లో 1,43,737 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 55,07,182 కు చేరింది.
కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన విధివిధానాలతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గదర్శకాలకోసం
https://www.mohfw.gov.in/pdf/ClinicalManagementProtocolforCOVID19.pdf చూడవచ్చు.
చికిత్స పరంగా తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్రమైన స్థాయి ఆధారంగా కోవిడ్-19 చికిత్స జరగాల్సిన తీరుతెన్నులను ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తాయి. ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణావిధానాలు కూడా ఈ మూడు దశల తీవ్రత ఆధారంగా నిర్ణయించారు. ఒక సామాన్య లక్షణాలున్న బృందానికి చేయాల్సిన పరీక్షలు, చికిత్సను కూడా ఈ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే, ఏ విధమైన చికిత్సా విధానం అవలంబించాలన్నా, కచ్చితంగా సమస్యను విశ్లేషించిన మీదటే తగిన నిర్ణయం తీసుకోవాలి.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి.
****
(Release ID: 1631384)
Visitor Counter : 270
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam