ఆర్థిక మంత్రిత్వ శాఖ
చట్టం, విధివిధానాలకు సంబంధించి జి ఎస్ టి కౌన్సిల్ సిఫార్సులు
Posted On:
12 JUN 2020 4:08PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో 40వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు.
చట్టం, విధివిధానాలకు సంబంధించి జి ఎస్ టి కౌన్సిల్ ఈ కింది సిఫార్సులు చేసింది.
వర్తకానికి అనువైన చర్యలు:
పాత రిటర్న్ ల ఆలస్యపు జరిమానా తగ్గింపు:
రిటర్న్ ల దాఖలు లో పెండింగ్ లు పూర్తిగా తగ్గించే చర్యల్లో భాగంగా 2017 జులై నుంచి 2020 జనవరి వరకు ఉన్న పన్ను కాలానికి సంబంధించి ఫార్మ్ జిఎస్టీ ఆర్ - 3బి దాఖలు చేయనివారికి ఆలస్యపు జరిమానా తగ్గించటమో, రద్దు చేయటమో జరుగుతుంది.
పన్ను బాధ్యత లేని పక్షంలో ఆలస్యపు జరిమానా సున్నా
ఎలాంటి పన్ను బాధ్యతా లేని పక్షంలో ఒక్కో రిటర్న్ కు గరిష్ఠంగా ఆలస్యపు రుసుమును రూ. 500/- గా నిర్ణయించారు.
01.07.2020 నుంచి 30.09.2020 వరకు దాఖలు చేసిన అన్ని జిఎస్టీ ఆర్ - 3బి రిటర్న్ లకు ఈ ఆలస్యపు రుసుము తగ్గింపు వర్తిస్తుంది.
ఇదే కాకుండా కొద్దిమొత్తంలో పన్ను చెల్లించే వారికి ఊరట కలిగేలా 2020 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పన్ను కాలానికి ఆలస్యపు దాఖలుకు అవకాశం:
మొత్తం టర్నోవర్ రూ. 5 కోట్ల వరకు ఉంటూ కొద్దిమొత్తంలో పన్ను చెల్లించేవారికి 2020 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో చేసిన సరఫరాలకు గాను ఆలస్యపు రిటర్న్ ల దాఖలుకు వడ్డీ రేటు 2020 జులై వరకు ఏడాదికి 18% నుంచి 9% కు తగ్గిస్తూ 30.09.2020 వరకు ఈ అవకాశం కల్పించారు. అంటే, ఈ నెలలకు కొద్దిమొత్తం పన్ను చెల్లింపుదారుల మీద 2020 జులై 6 వరకు ఎలాంటి అపరాధ వడ్డీ వేయరు, ఆ తరువాత 30.09.2020 వరకు 9% వడ్డీ వసూలు చేస్తారు.
తరువాత కాలానికి 2020 మే, జూన్, జులై నెలలకు తక్కువమొత్తం పన్ను చెల్లింపుదారులకు ఊరట:
కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మొత్తం టర్నోవర్ రూ. 5 కోట్ల వరకు ఉన్నవారు 2020 మే, జూన్, జులై నెలల్లో చేసిన సరఫరాలకు గాను దాఆఖలు చేసే జిఎస్టీ ఆర్ - 3బి రిటర్న్ లకు ఆలస్యపు రుసుము, వడ్డీ రద్దు చేయటం ఒక ఊరట. అయితే, వారు 2020 సెప్టెంబర్ లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ రద్దు పునరుద్ధరణ కోరుతూ ఏకకాల పొడిగింపు:
రద్దయిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పొందలేని పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పిస్తూ మరొక అవకాశం ఇస్తారు. 12.06.2020 లోగా రిజిస్ట్రేషన్ రద్దయి ఉన్న పక్షంలో వాటి పునరుద్ధరణ కోసం దరఖాస్తులు చేసుకోవటానికి 30.09.2020 వరకు అవకాశం ఇస్తారు.
సిజిఎస్ టి చట్టం లోను, ఐజి ఎస్ టి చట్టంలోను సవరణలు చేస్తూ ఫైనాన్స్ యాక్ట్ 2020 లోని కొన్ని క్లాజులు 30.06.2020 నుంచి అమలులోకి వస్తాయి.
*****
గమనిక: జి ఎస్ టి మండలి సిఫార్సులను సులభంగా అర్థమయ్యేలా ఈ ప్రకటనలో పొందుపరచటమైంది. ఈ అంశాలకు సంబంధించిన పూర్తిపాఠాన్ని సర్క్యులర్లు, నోటిఫికేషన్ల ద్వారా ప్రకటిస్తారు. అవి మాత్రమే చట్టబద్ధమైనవి.
(Release ID: 1631245)
Visitor Counter : 340
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam