ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

నమూనా జనాభాలో 0.73 శాతం మందికి మాత్రమే కోవిడ్-19 సోకినట్లు వెల్లడించిన - ఐ.సి.ఎమ్.ఆర్. యొక్క సెరో-నిఘా అధ్యయనం

Posted On: 11 JUN 2020 6:48PM by PIB Hyderabad
సర్వే చేసిన నమూనా జనాభాలో 0.73 శాతం మందికి మాత్రమే సార్స్-కోవ్-2 సోకినట్లు ఐ.సి.ఎమ్.ఆర్. యొక్క సెరో-నిఘా అధ్యయనం రుజువు చేసింది.  ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ రోజు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర ఆరోగ్య విభాగం, ఎన్.సి.డి.సి. మరియు డబ్ల్యూ.హెచ్.‌ఓ. ఇండియా సహకారంతో ఐ.సి.ఎం.ఆర్.-2020 మే నెల లో కోవిడ్-19 కోసం మొదటి సెరో-సర్వే నిర్వహించింది.  83 జిల్లాల్లో 28,595 గృహాలు, 26,400 మంది వ్యక్తులతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో రెండు భాగాలు ఉన్నాయి, వీటిలో సాధారణ జనాభాలో సార్స్-కోవ్-2 బారిన పడిన జనాభా యొక్క కొంత భాగాన్ని అంచనా వేసే ప్రాథమిక ప్రక్రియ పూర్తయింది.  హాట్‌స్పాట్ నగరాల కంటైన్మెంట్ జోన్లలో సార్స్-కోవ్-2 బారిన పడిన జనాభాలో కొంత భాగాన్ని అంచనా వేసే రెండవ ప్రక్రియ త్వరలో పూర్తికానుంది. 

లాక్ డౌన్ సమయంలో తీసుకున్న చర్యలు వైరస్ వ్యాప్తిని తక్కువగా ఉంచడంలో, అదేవిధంగా కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో విజయవంతమయ్యాయని అధ్యయనం స్పష్టంగా పేర్కొంది.  గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం 1.09 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు ఎక్కువ అని ఐ.సి.ఎం.ఆర్. లెక్కించింది.  అయితే, వ్యాధి సోకిన కారణంగా మరణాల రేటు అతి తక్కువగా 0.08 శాతంగా నమోదయ్యింది.  దీనిని బట్టి,  జనాభాలో ఎక్కువ భాగం ఎప్పటికప్పుడు కోవిడ్ ను అరికట్టడానికి సూచించిన నిబంధనలను తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి స్పష్టమౌతోంది. 

గత 24 గంటల్లో మొత్తం 5,823 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకున్నారు.   దీంతో, ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం 1,41,028 మంది రోగులు కోవిడ్-19 చికిత్స అనంతరం కోలుకున్నారు.  కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 49.21 శాతంగా నమోదయ్యింది.  భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్-19 వ్యాధి సోకిన  1,37,448 మంది రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి.  ప్రస్తుతం, కోలుకున్న రోగుల సంఖ్య, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA . 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 
          technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు  :  

                    ncov2019[at]gov[dot]in     మరియు    @CovidIndiaSeva. 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ) నెంబరును సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

****



(Release ID: 1631020) Visitor Counter : 206