ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం
చికిత్స పొందుతున్నవారి సంఖ్యను మించి కోలుకున్నవారి సంఖ్య

50 లక్షల శాంపిల్స్ కు మించి పరీక్షించిన ఐసిఎంఆర్
రాష్ట్రాలకు సహకరించేందుకు 6 నగరాల్లో కేంద్ర బృందాల నియామకం

Posted On: 10 JUN 2020 4:20PM by PIB Hyderabad

గడిచిన 24 గంటల్లో 5,991 మంది కోవిడ్ - 19 బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,35,205 కు చేరుకుంది. ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య1,33,632 గా ఉంది. దీనివలన మొదటి సారిగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. కోలుకున్నవారి శాతం 48.88% చేరింది.

  ఐసిఎంఆర్ జరిపిన పరీక్షలు కూడా ఈ రోజుకు  50,61,332  కు చేరటంతో  50 లక్షలు పైబడినట్టయింది. గడిచిన 24  గంటల్లో ఐసిఎంఆర్ జరిపిన పరీక్షలు 1,45,216 గా నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకిన వారిని నిర్థారించటానికి పరీక్షల సంఖ్యను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వ లేబరీటరీల సంఖ్య 590 కి పెంచగా ప్రైవేట్ లేబరేటరీల సంఖ్య 233 కి పెరిగింది. దీంతో మొత్తం 823 లేబరేటరీలు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు, మున్సిపల్ ఆరోగ్యాధికారులకు అండగా ఉంటూ సాంకేతిక సహాయం అందించేలా కేంద్రబృందాలను  కూడా పంపటం జరిగింది. కోవిడ్ -19  విషయంలో అక్కడ తీసుకుంటున్న చర్యలను సమీక్షించి తగిన సూచనలివ్వటానికి ముంబయ్, అహమ్మదాబాద్, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, బెంగళురు నగరాలను ఇప్పటివరకు ఎంచుకున్నారు.

ఈ బృందాలు తమకు కేటాయించిన నగరాలను వచ్చే వారంలోగా సందర్శిస్తాయి. కోవిడ్ -19 విషయంలో     ప్రజారోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తాయి. ఈ బృందాలు రోజువారీ నివేదికలను రాష్ట్ర ఆరోగ్య విభాగానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు అందజేస్తాయి. అత్యవసరమనిపించిన పక్షంలో తమ పర్యటన్మ పూర్తికాకముందే తమ అభిప్రాయాలను కూడా జోడించి ముందుగానే నివేదిక అందజేస్తాయి.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19@gov.in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019@gov.in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.

 

***(Release ID: 1630705) Visitor Counter : 42