కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

లాక్డౌన్ సమయం లో 36.02 లక్షల ఈపిఎఫ్ఓ క్లెయిమ్‌లను పరిష్కారం

74% పైగా లబ్ధిదారులకు తక్కువ వేతనాలు

Posted On: 09 JUN 2020 4:33PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో  తన సభ్యుల జీవన విధానాన్ని సులభతరం చేయడానికి, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్దమైన సంస్థ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) సకాలంలో, సమర్థవంతంగా  సభ్యులకు సేవలు అందించడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇపిఎఫ్ఓ 36.02 లక్షల క్లైములను పరిష్కరించుకుంది, తద్వారా 2020 ఏప్రిల్, మే చివరి రెండు నెలల్లో తన సభ్యులకు రూ.11,540 కోట్లు చెల్లించింది. ఇందులో 15.54 లక్షల క్లెయిమ్‌లు, రూ. 4580 కోట్లు హక్కుదారులకు, ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) కింద ఇటీవల ప్రవేశపెట్టిన కోవిడ్ -19 అడ్వాన్స్‌కు సంబంధించినవి.

కోవిడ్-19 అడ్వాన్స్ ఈ క్లిష్ట సమయాల్లో ఈపిఎఫ్ఓ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంది, ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ .15,000 కన్నా తక్కువ ఉన్న సభ్యులకు. కోవిడ్-19 అడ్వాన్స్‌ను ప్రాథమిక వేతనాలు, డిఎ వరకు మూడు నెలలు లేదా ఈపిఎఫ్ ఖాతాలో సభ్యుల క్రెడిట్‌కు 75% వరకు, ఏది తక్కువైతే అది చాలా మంది కార్మికులకు సకాలంలో ఉపశమనం కలిగించింది, రుణగ్రస్తులు కాకుండా ఆదుకోగలిగాయి. 

పని చేసే ప్రదేశంలో సామాజిక దూర నిబంధనలను గౌరవిస్తూ, లాక్ డౌన్ సమయంలో ఈపిఎఫ్ఓ  50% కంటే తక్కువ సిబ్బందితో పనిచేసింది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, కోవిడ్-19 అడ్వాన్స్‌ల కోసం  ఈపిఎఫ్ఓ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్యవధిని సుమారు 10 రోజుల నుండి సుమారు 3 రోజుల వరకు గణనీయంగా తగ్గించింది. అంతేకాకుండా, ఏప్రిల్-మే 2019 లో 33.75 లక్షల క్లెయిమ్‌ లను పరిష్కరిస్తే, 2020 ఏప్రిల్-మే నెలల్లో మొత్తం 36.02 లక్షల క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి.  50% కంటే తక్కువ మంది సిబ్బంది పనికి హాజరు కాలేదు, ఇది మొత్తం శ్రామిక శక్తి ఉత్పాదకతలో 100% కంటే ఎక్కువ. సిబ్బంది నిబద్ధతతో పాటు, క్లెయిమ్ పరిష్కారంలో కొత్త ప్రమాణాలను సాధించడంలో కృత్రిమ మేధస్సు వాడకం పెద్ద పాత్ర పోషించింది.

ఈపిఎఫ్ఓ కార్యాలయాలు అత్తెసరు సిబ్బందితో పనిచేస్తున్నందున, తన సభ్యుల అంచనాలను అందుకోవడానికి వినూత్నంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతికూలతను ప్రయోజనకరంగా మారుస్తూ, ఈపిఎఫ్ఓ తన మొదటి పూర్తి ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్యవస్థను కేవలం ఐదు రోజుల రికార్డు సమయంలో ప్రారంభించింది. కోవిడ్-19 క్లైముల్లో దాదాపు 54% ఇప్పుడు ఆటో మోడ్ ద్వారా పరిష్కారం అవుతున్నాయి. ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఈపిఎఫ్ఓ కోసం క్లెయిమ్ పరిష్కార సమయాన్ని తీవ్రంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.

ఆటోమేషన్. అంకిత భావంతో  పనిచేసే సిబ్బందితో  ఈపిఎఫ్ఓ ప్రతి రోజూ రూ. 270 కోట్లు విలువైన 80,000 కంటే ఎక్కువ క్లెయిమ్‌లను సంక్షోభ సమయాల్లో దాని సభ్యులకు సామాజిక భద్రత మద్దతు ఇస్తోంది

*****



(Release ID: 1630549) Visitor Counter : 268