రైల్వే మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు అడిగినన్ని శ్రామిక్ రైళ్ళు ఇవ్వటానికి రైల్వేలు సంసిద్ధత

అడిగిన 24 గంటల్లో ఇస్తామని రైల్వే బోర్డు చైర్మన్ పునరుద్ఘాటన
ఇప్పటివరకు 4347 శ్రామిక్ రైళ్లలో 60లక్షల మంది చేరవేత

Posted On: 09 JUN 2020 5:07PM by PIB Hyderabad

వలస కార్మికులను సురక్షితంగా చేరవేయటానికి వీలుగా రాష్ట్రాలు అడిగినన్ని రైళ్ళు సమకూర్చటానికి భారతీయ రైల్వేలు సంసిద్ధంగా ఉన్నాయి


ఇప్పటివరకు భారతీయ రైల్వేలు మొత్తం 4347  శ్రామిక్ స్పెషల్ రైళ్ళు నడపగా సుమారు 60 లక్షలమంది తమ గమ్య స్థానాలు చేరుకోగలిగారు. 2020 మే 1వ తేదీ నుంచి శ్రామిక్ రైళ్ళు నడుస్తున్న సంగతి తెలిసిందే.


రాష్ట్ర ప్రభుత్వాలు తమకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళు కావాలని కోరితే కేవలం24  గంటల్లోనే సమకూర్చగలమని భారతీయ రైల్వేలు స్పష్టం చేశాయి. రాష్ట్రాలు తమ అవసరాలను సూచించాల్సిందిగా రైల్వే మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికీ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళ తరలింపుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని రైళ్లకోసం కోరవచ్చునని సూచిందింది.


ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ మే 29న, జూన్ 3న రాష్ట్రాలకు లేఖలు రాశారు. " భారతీయ రైల్వేలు శ్రామిక్ రైళ్ళ ను అడిగిన 24 గంటల్లోపే సమకూర్చటానికి సిద్ధంగా ఉంది. " అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు కూడా ఇదే విషయం చెబుతూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరో లేఖ రాశారు.


భవిష్యత్తులో కూడా ఇలాంటి అవసరలాకు తగినట్టుగా అదనపు శ్రామిక్ స్పెషల్ రైళ్ళు అందించటానికి భారతీయ రైల్వేలు సిద్ధంగా ఉన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ అవసరమైనప్పుడు కూడా అతి స్వల్ప వ్యవధిలోనే సమకూర్చగలమని కూడా తెలియజేసింది. 


వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవటానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు 2020 మే 28నాటి ఆదేశాలలో పేర్కొంది. ఈ ఆదేశాల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకొవటానికి భారతీయ రైల్వేలు సిద్ధంగా ఉన్నాయి. 

***


(Release ID: 1630477) Visitor Counter : 279