ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
సామాజిక, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు
ప్రామాణిక ఆచరణ మార్గదర్శకాల విడుదల
Posted On:
05 JUN 2020 2:11PM by PIB Hyderabad
భారత్ ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తూ మరోవైపు ముందస్తు జాగ్రత్తలతోబాటు చురుకైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక ఆచరణ మార్గదర్శకాలను ప్రకటించింది. కోవిడ్ వ్యాపించటానికి ఎక్కువగా అవకాశమున్న ప్రభుత్వ సంస్థలలోను, పాక్షిక ప్రభుత్వ సంస్థలలోను ఈ మార్గదర్శకాలను అనుసరించాలని నిర్దేశించింది. సామాజిక ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూనే కోవిడ్ వ్యాపించకుండా చూడటమే ఈ సరికొత్త మార్గదర్శకాల లక్ష్యం.
కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించటానికి ఆఫీసులలో తీసుకోవాల్సిన చర్యలు:
https://www.mohfw.gov.in/pdf/1SoPstobefollowedinOffices.pdf
కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించటానికి ప్రార్థనాస్థలాల్లో తీసుకోవాల్సిన చర్యలు:
https://www.mohfw.gov.in/pdf/2SoPstobefollowedinReligiousPlaces.pdf
కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించటానికి రెస్టారెంట్లలో తీసుకోవాల్సిన చర్యలు:
https://www.mohfw.gov.in/pdf/3SoPstobefollowedinRestaurants.pdf
కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించటానికి షాపింగ్ మాల్స్ లో తీసుకోవాల్సిన చర్యలు:
https://www.mohfw.gov.in/pdf/4SoPstobefollowedinShoppingMalls.pdf
కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించటానికి హోటళ్ళు తదితర ఆతిథ్య విభాగాల్లో తీసుకోవాల్సిన చర్యలు:
https://www.mohfw.gov.in/pdf/5SoPstobefollowedinHotelsandotherunits.pdf
కోవిడ్-19 నేపథ్యంలో ఔట్ పేషెంట్ విభాగం మందుల రీ ఇంబర్స్ మెంట్ లబ్ధిదారుల విషయంలో మంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. వాటిని చూడాలంటే :
https://www.mohfw.gov.in/pdf/OPDmedicinesspecialsanctionCOVID.pdf
గడిచిన 24 గంటల్లో మొత్తం5,355 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య1,09,462 కు . చేరింది. బాధితులలో కోలుకున్నవారి శాతం 48.27% గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య1,10,960. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రభుత్వ లేబరేటరీలు 507 కు చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 217 కు పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 727 అయింది. గడిచిన 24 గంటల్లో 1,43,661 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 43,86,379 కు చేరింది.
2020 జూన్ 5 నాటికి కోవిడ్ సంబంధమైన మౌలిక వసతులు బలోపేతమయ్యాయి. ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సకే పరిమితమైన ఆస్పత్రుల సంఖ్య ప్రస్తుతం 957 ఉండగా వాటిలో 1,66,460 ఐసొలేషన్ పడకలు, 21,473 ఐసియు పడకలు, 72,497 ఆక్సిజెన్ సహాయక పడకలు ఉన్నాయి. కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 2,362 ఉండగా వాటిలో 32,593 ఐసొలేషన్ పడకలు; 10,903 ఐసియు పడకలు, 45,562 ఆక్సిజెన్ సహాయక పడకలు కూడా వాడకంలోకి వచ్చాయి. 11,210 క్వార్రంటైన్ కేంద్రాలు, 7,529 కోవిడ్ కేర్ కేంద్రాలలో 7,03,786 పడకలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం ఇప్పటిదాకా 128.48 లక్షల ఎన్95 మాస్కులు, 104.74 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు అందజేసింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టొల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి.
****
(Release ID: 1629633)
Visitor Counter : 302
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam