ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

కోవిడ్-19 వ్యాధి నుండి మొత్తం 95,526 మంది రోగులు కోలుకున్నారు.

Posted On: 02 JUN 2020 6:23PM by PIB Hyderabad

ప్రస్తుతం, 97,581 కోవిడ్క్రి-19 పోజిటివ్ కేసులు ఉన్నాయి అన్నీ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.  గత 24 గంటల్లో మొత్తం 3,708 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  ఇంతవరకు మొత్తం 95,526 మంది కోవిడ్-19 రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 48.07 శాతంగా ఉంది.  భారత దేశంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది.  కాగా మరణాల రేటులో భారతదేశం ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది ఈ రోజు వరకు, మరణాల రేటు 2.82 శాతంగా ఉంది

భారతదేశ జనాభాతో పోలిస్తే,   14 అత్యంత ప్రభావిత దేశాల మొత్తం జనాభాకు  దాదాపు సమానంగా ఉంది.   అదేవిధంగా, 2020 జూన్ 1వ తేదీ నాటికి, అత్యధికంగా ప్రభావితమైన 14 దేశాలలో మొత్తం కోవిడ్-19 సోకిన కేసుల సంఖ్య, భారతదేశంలో మొత్తం కోవిడ్-19 సోకిన కేసుల సంఖ్య  కంటే 22.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.   కాగా,  కోవిడ్-19 కారణంగా ఈ 14 ప్రభావిత దేశాలలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య,   భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కంటే 55.2 రెట్లు ఎక్కువగా ఉంది.  

ఈ పరిస్థితులలోసకాలంలో కేసు గుర్తింపు మరియు కేసుల క్లినికల్ నిర్వహణ ద్వారా సాధ్యమైనంతవరకు మరణాలను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది.   సాపేక్షంగా తక్కువ మరణ గణాంకాలు నమోదుకావడానికికేసుల సకాలంలో గుర్తింపు మరియు క్లినికల్ నిర్వహణతో కూడిన ఈ రెండు వైపుల వ్యూహమే కారణమని చెప్పవచ్చు . 

కోవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే,  భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారిలో 50 శాతం మంది భారతదేశ జనాభాలో 10 శాతంగా ఉన్న 60 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఉన్నట్లు గమనించడమైంది.  భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారిలో దాదాపు 73 శాతం మంది మధుమేహం, అధిక రక్తపోటు,  గుండె సంబంధమైన, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు.   అందువల్ల, ఈ అధిక ప్రమాద కారణాలతో ఉన్న ఈ  సమూహాలను సమర్థవంతంగా రక్షించాల్సిన అవసరం ఉంది.

అధిక ప్రమాదం పొంచి ఉన్న రోగులలో కోవిడ్-19 ను నివారించడానికి, ఈ క్రింది వాటితో సహా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ముందుగా ఉన్న అనారోగ్య వైద్య పరిస్థితులు (మధుమేహం, అధిక రక్త పోటు, మరియు గుండె సంబంధమైన ఆరోగ్య సమస్యలువంటివి) విషయంలో  వైద్యుడు సూచించిన విధంగా సాధారణ మందులను కొనసాగించాలి.  ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన రోగనిరోధక శక్తిని పెంచే చర్యలను తీసుకోవాలి. ఉదాహరణకు, మూలికా టీ తాగడం, 'కద' తీసుకోవడం; వైద్య సలహా అవసరమైతే టెలి మెడిసిన్ (ఈ-సంజీవని) వంటివి ఉపయోగించాలి.  మీరు కోవిడ్-19 రోగులతో సన్నిహిత సంబంధంలోకి వచ్చారో లేదో తనిఖీ చేయడానికి, ఆరోగ్య సేతు యాప్  సహాయంతో, మిమ్మల్ని మీరు స్వయంగా అంచనా వేసుకోండి.  ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా స్వీయ పర్యవేక్షణ చేపట్టండి.  ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడం ద్వారా కోవిడ్-19 ను ముందుగానే గుర్తించండి. అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు కోవిడ్-19 లక్షణాలు కనబడితే,  వారు హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా టెలి-మెడిసిన్ ద్వారా వైద్య సహాయం తీసుకోవాలి లేదా వ్యక్తిగతంగా వైద్యుడిని సందర్శించాలి.

మంచిగా  చేతి శుభ్రతను, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలను అనుసరించడం ద్వారా పౌరులు అధిక-ప్రమాద సమూహానికి తగిన విధంగా సహాయం అందించాలి.  ఎవరైనా కోవిడ్-19 లక్షణాలతో ఉంటే,  వారితో  ఇతరుల సన్నిహిత సంబంధాన్ని వారించాలి.  సామాజిక దూరాన్ని పాటిస్తూ, రోజువారీ పనులలో అధిక ప్రమాదం ఉన్నవారికి సహాయం చేయాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు, మత సమావేశాలకూ దూరంగా ఉండాలి. 

అత్యవసరం అయితే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. 

కోవిడ్-19 పై విజయం సాధించడానికి, ‘జన అభియాన్’   ఒక భారీ ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం.  కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటానికి #IndiaWillWin ఉపయోగిద్దాం. అవగాహన, నివారణ ప్రయత్నాలు, సకాలంలో చికిత్స అనే మూడు విషయాలలో ఒకరికొకరు సహకరించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA . 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 
          technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  
                    ncov2019[at]gov[dot]in     మరియు    @CovidIndiaSeva. 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ)  ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

****



(Release ID: 1628804) Visitor Counter : 405