ప్రధాన మంత్రి కార్యాలయం

తెలంగాణ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు శుభకామన లు వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 02 JUN 2020 9:51AM by PIB Hyderabad

 తెలంగాణ  స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజల కు  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భం లో  ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు కూడా ప్రధాన మంత్రి  తన శుభకామనల ను వ్యక్తం చేశారు.  

  ‘‘తెలంగాణ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు.  ఈ రాష్ట్రం యొక్క ప్రజానీకం వివిధ రంగాల లో రాణిస్తున్నారు.  ఈ రాష్ట్రం భారతదేశం యొక్క వృద్ధి ప్రక్షేప పథాని కి విలువైనటువంటి తోడ్పాటుల ను ప్రసాదిస్తోంది. తెలంగాణ ప్రజల పురోగతి కోసం మరియు సమృద్ధి కోసం నేను ప్రార్థిస్తున్నాను. 

  ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు ఇవే నా యొక్క శుభకామన లు.  కఠోర శ్రమ మరియు సాహసం ఈ గడ్డ యొక్క సంస్కృతి కి సమానార్ధకాలు గా నిలచి ఉన్నాయి.  భారతదేశం యొక్క  వృద్ధి లో ఈ రాష్ట్ర పాత్ర కు ఎనలేని విలువ ఉన్నది.  ఈ రాష్ట్ర ప్రజలు వారి యొక్క భావి ప్రయత్నాల లో అత్యుత్తమ ఫలితాల ను సాధించాలని అభిలషిస్తున్నాను’’ అని  ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  

 

 

 


(Release ID: 1628567)