రైల్వే మంత్రిత్వ శాఖ
2020 జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా నడవనున్న ప్రత్యేక రైళ్ళు.
జూన్ 1న ప్రారంభమయ్యే 200 రైళ్ళలో తొలిరోజు ప్రయాణించనున్న 1.45 లక్షల మంది ప్రయాణికులు
2020 జూన్ 1 నుంచి 30 వరకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న సుమారు26 లక్షల మంది ప్రయాణికులు.
మే 12 నుంచి నడుస్తున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు, 30 ఎసి ప్రత్యేక రైళ్ళకు ఇవి అదనం.
ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. నిర్దారిత , ఆర్.ఎ.సి టిక్కెట్లు కలిగిన వారిని మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టడానికి, రైలు ఎక్కడానికి అనుమతిస్తారు.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణికులందరినీ తప్పకుండా పరీక్షించి, వైరస్ లక్షణాలు లేనివారిని మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తారు.
Posted On:
31 MAY 2020 6:12PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వశాఖ(ఎంఒఆర్), కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ(ఎం.ఒ.హెచ్.ఎఫ్.డబ్ల్యు), హోంమంత్రిత్వశాఖ (ఎం.హెచ్.ఎ)లను సంప్రదించిన మీదట, 2020 జూన్ 1 వ తేదీ నుంచి ప్రయాణికుల రైలుసేవలు పాక్షికంగా ప్రారంభించనున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. జూన్ 1 వ తేదీనుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ళలో తొలిరోజు 1.45 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణించనున్నారు. జూన్ 01 వ తేదీ 2020 నుంచి భారతీయ రైల్వే 200 పాసింజర్ సర్వీసులను నడపనుంది. ఇందుకు సంబంధించిన రైళ్ళ జాబితా కింది లింక్‌లో అనుబంధంలో ఉంది.
భారతీయ రైల్వే మే 1 నుంచి నడుపుతున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు, మే 12, 2020 నుంచి నడుపుతున్న ఎసి ప్రత్యేక రైళ్ళ(30 రైళ్ళు)కు అదనంగా రేపు జూన్ 1, 2020నుంచి భారతీయ రైల్వే 200 రైళ్ళను నడపనుంది. పాసింజర్ సర్వీసులను క్రమంగా పునరుద్ధరించే చర్యలలో ఇది కీలక అడుగు.,
ఈ రైళ్ళు రెగ్యులర్ రైళ్ళ పద్థతిలో నడుస్తాయి. ఇవన్నీ పూర్తిగా ఎసి, నాన్ ఎసి తరగతి రిజర్వుడు రైళ్ళు. జనరల్ కోచ్‌లు, రిజర్వుడు సిట్టింగ్ సదుపాయం కలిగి ఉంటాయి. రైలులో రిజర్వేషన్ లేని కోచ్‌లు ఉండవు. ఆయా తరగతుల వారీగా సాధారణ చార్జీలనే వసూలు చేస్తారు. రిజర్వుడు జనరల్ సిట్టింగ్ కోచ్‌ల విషయంలో అవి రిజర్వుడు అయినందున రెండవ తరగతి సీటింగ్ (2 ఎస్) చార్జీలను రిజర్వుడు ట్రెయిన్‌లకు వసూలుచేస్తారు. ప్రయాణికులందరికీ సీటు సదుపాయం కల్పిస్తారు.
ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి టిక్కెట్లు బుక్ చేసుకున్న మొత్తం ప్రయాణికులు 25, 82,671.ఈ రైళ్లకు టిక్కెట్ బుకింగ్ ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ లో చేయడం జరుగుతోంది. రిజర్వేషన్ కౌంటర్లు, కామన్‌సర్వీస్ కౌంటర్లు (సిఎస్‌సి), టిక్కెట్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్ల బుకింగ్‌కు రైల్వే శాఖ 2020 మే 22 నుంచి అనుమతించింది.
ముందుగానే తెలియజేసినట్టు, మే 12, 2020 నుంచి నడుస్తున్న 30 స్పెషల్ రాజధాని తరహా రైళ్ళు, జూన్ 1 వ తేదీనుంచి ప్రారంభం కానున్న 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు( మొత్తం 230 రైళ్ళకు) సవరించిన సూచనలను రైల్వే శాఖ జారీ చేసింది.
అన్ని 230 ప్రత్యేకరైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే కాలాన్ని (ఎఆర్‌పి) 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. పార్శల్,లగేజ్ బుకింగ్‌లను ఈ 230 రైళ్ళలో అనుమతిస్తారు. ఈ మార్పులు 31 మే ఉదయం 8 గంటల బుకింగ్ లనుంచి వర్తిస్తాయి. ఇతర షరతులు ఉదాహరణకు కరంట్ బుకింగ్, రోడ్‌సైడ్ స్టేషన్లకు తత్కాల్ కోటా కేటాయింపు వంటివి రెగ్యులర్ టైమ్‌టేబుల్డ్ రైళ్ళకు వర్తించినట్టే అమలు చేస్తారు. తత్కాల్ టికెట్ బుకింగ్ లు 2020 జూన్ 29 నుంచి అంటే 30 జూన్ 2020 ప్రయాణ తేదీతో ప్రారంభమౌతాయి. ఈ సూచనలను భారతీయ రైల్వే వెబ్‌సైట్ www.indianrailways.gov.in లో ట్రాఫిక్ , కమర్షియల్ డైరక్టరేట్ లోని కమర్షియల్ సర్కులర్ ల శీర్షిక కింద చూడవచ్చు.
చార్టింగ్, బోర్డింగ్ ఆఫ్ ట్రెయిన్స్:
1.ఆర్.ఎ.సి, వెయిట్ లిస్ట్ లను ప్రస్తుత నిబంధనల ప్రకారం రూపొందిస్తారు.
2. రిజర్వేషన్ లేని ( అన్ రిజర్వుడు టికెట్స్-యుటిఎస్) జారీచేయరు. రైలులో ప్రయాణ సమయంలో ఎలాంటి టిక్కెట్లు జారీచేయరు.
3. అనుమతి- పూర్తిగా కన్ఫర్మేషన్ టికెట్‌కలిగిన ప్రయాణికులు, ఆర్.ఎ.సి ప్రయాణికులు, పాక్షిక వెయిట్ లిస్ట్ లోని టికెట్ దారులను (ఒకే పిఎన్ఆర్ కలిగి ఉండి అందులో ఖాయమైన టిక్కెట్టు, వెయిట్ లిస్ట్ ప్రయాణికులు ఉన్నప్పుడు) అనుమతిస్తారు.
4. అనుమతి లేని వారు-వెయిట్ లిస్ట్ లోని ప్రయాణికులు.
5. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ను 29 జూన్ 2020 నుంచి అంటే 2020 జూన్ 30 ప్రయాణ తేదీనుంచి , ఆ తర్వాత చేసుకోవచ్చు.
6. తొలి చార్టు,రైలు బయలు దేరడానికి కనీసం 4 గంటల ముందు, రెండో చార్టు రైలు ప్రయాణ సమయానికి కనీసం రెండు గంటల ముందు ( ప్రస్తుతం అనుసరిస్తున్నట్టు 30 నిమిషాల ముందు కాకుండా) తయారు చేస్తారు.
7.ప్రయాణికులందరినీ తప్పకుండా పరీక్షించి, వైరస్ లక్షణాలు ఏవీ లేని వారిని మాత్రమే రైలు ఎక్కడానికి, అనుమతిస్తారు.
8. ఈ ప్రత్యేక రైళ్ళలో ప్రయాణించే ప్రయాణికులు ఈ కింది జాగ్రత్త చర్యలు పాటించాలి.
(1.) ప్రయాణికులందరూ ప్రవేశం, ప్రయాణ సమయంలో ముఖానికి మాస్క్ ధరించి ఉండాలి.
(2) ప్రయాణికులు థర్మల్ స్క్రీనింగ్ కోసం రైలు బయలుదేరే సమయానికి 90 నిమిషాల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
( 3).ప్రయాణికులు సామాజిక దూరం పాటించాలి.
(4.) ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నతరువాత , ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులో ఉన్న ఆరోగ్య సంబంధ నియమాలకు కట్టుబడి ఉండాలి.
టిక్కెట్ల రద్దు, రిఫండ్ నిబంధనలు: రైల్వే పాసింజర్ల ( టికెట్ కాన్సిలేషన్, రిఫండ్ ఆఫ్ ఫేర్ ) నిబంధనలు , 2015 వర్తిస్తాయి. దీనికితోడు జ్వరం ఎక్కువగా ఉండడం, లేదా కోవిడ్ -19 లక్షణాల కారణంగా ప్రయాణికుడిని ప్రయాణానికి అనుమతించని పక్షంలో కూడా రిఫండ్ నిబంధనలు వర్తిస్తాయి.
స్టేషన్‌లో స్క్రీనింగ్ పరీక్ష సమయంలో ఎవరైనా ప్రయాణికుడికి విపరీతమైన జ్వరం లేదా కోవిడ్ -19 తరహా లక్షణాలు ఉన్నట్టు గుర్తించినట్టయితే అలాంటి ప్రయాణికుడికి ఖరారైన టిక్కెట్టు ఉన్నప్పటికీ అతనిని ప్రయాణానికి అనుమతించరు. అలాంటి సందర్భంలో ప్రయాణికుడికి కింది విధంగా పూర్తి రిఫండ్ చెల్లిస్తారు.:-
1.పిఎన్ఆర్ పై ఒకే ప్రయాణికుడు ఉన్నప్పుడు
2.బృందటిక్కెట్‌లో ఒక ప్రయాణికుడు ప్రయాణానికి అనర్హుడుగా తేలి,అదే పిఎన్ఆర్ నెంబరుకలిగిన మిగిలిన ప్రయాణికులందరూ కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడకపోతే అందరు ప్రయాణికులకూ రిఫండ్ చెల్లిస్తారు.
3. బృంద టికెట్‌లో ఒక ప్రయాణికుడు ప్రయాణానికి అనర్హుడుగా తేలి అదే పి.ఎన్.ఆర్ నెంబరు గలఇతర ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగించదలచుకుంటే , ప్రయాణానికి అనుమతింపబడని ప్రయాణికుడికి పూర్తి రిఫండ్ చెల్లిస్తారు.
పైన పేర్కొన్న అన్ని కేసులలో రైల్వే స్టేషన్లలో ప్రవేశం వద్ద లేదా స్క్రీనింగ్, చెకింగ్ పాయింట్ వద్ద టిటిఇలు సర్టిఫై చేస్తారు.(ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం) . వీటిలో కోవిడ్ -19 లక్షణాల కారణంగా లేదా జ్వరం వంటి లక్షణాల కారణంగా ఒకరు లేదా అంత కంటె ఎక్కువమందిని ప్రయాణానికి అనుమతించని విషయాన్ని తెలియజేస్తారు.
టిటిఇ సర్టిఫికేట్ పొందిన అనంతరం, రిఫండ్ కోసం ప్రయాణం మానుకున్న ప్రయాణికులు ప్రయాణ సమయం నుంచి పదిరోజులలోగా టిడిఆర్ దాఖలు చేయాలి.
కేటరింగ్: ప‌్రయాణ చార్జీలలో కేటిరింగ్ చార్జీలు కలపలేదు. ముందస్తు భోజన బుకింగ్ సదుపాయం, ఈ -కేటరింగ్ సదుపాయాన్ని కల్పించలేదు. ఐఆర్‌సిటిసి పరిమిత స్థాయిలో తినుబండారాలు, ప్యాక్‌చేసిన మంచినీటిని ప్యాంట్రీ కార్ సదుపాయం కల పరిమిత రైళ్ళలో డబ్బు చెల్లింపు పద్ధతిపై సమకూరుస్తుంది.
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సమయంలో తెలియజేయ డం జరుగుతుంది. ప్రయాణికులు స్వంతంగా భోజనం, మంచినీరు తెచ్చుకునేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. అన్ని కేటరింగ్, వెండింగ్‌యూనిట్లు (మల్టీపర్పస్ స్టాళ్ళు, బుక్‌స్టాళ్ళు, కెమిస్ట్‌స్టాళ్ళవంటివి) ఆయా రైల్వేస్టేషన్లలో తెరిచి ఉంచుతారు. ఫుడ్‌ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్ ల విషయంలో వండిన పదార్థాలను కొనుక్కుని తీసుకెళ్ళడానికి వీలు కల్పిస్తారుకాని అక్కడ కూర్చుని తినే సదుపాయం ఉండదు.
దుప్పట్లు, బెడ్‌షీట్లు : దుప్పట్లు, బెడ్‌షీట్లు , కర్టన్లు వంటి వాటిని రైలులో సరఫరా చేయరు. ప్రయాణికులు తమ స్వంత బెడ్‌షీట్లు, దుప్పట్లు ప్రయాణ సమయంలో తెచ్చుకోవాలి. ఇందుకోసం ఎసిబోగీలలో ఉష్ణోగ్రతను తగినవిధంగా నియంత్రిస్తారు.
ప్రయాణికులు ఎదురెదురు పడకుండా సాధ్యమైనంత వరకు వేరు వేరుగా ప్రవేశ , నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాల్సిందిగా జోనల్ రైల్వేలను ఆదేశించడం జరిగింది. రైల్వేస్టేషన్లలో రైలులో ప్రమాణీకృత సామాజిక దూరానికి సంబంధించిన మార్గదర్శకాలు అమలయ్యేలా జోనల్ రైల్వేలు చూస్తాయి.అలాగే ప్రయాణికుల భద్రత, రక్షణ, పరిశుభ్రతకు సంబంధించి నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తాయి.
ప్రయాణికులందరూ ఆరోగ్యసేతు అప్లికేషన్‌ను తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలి. తక్కు వ లగేజితో ప్రయాణించాలని ప్రయాణికులకు సూచించడం జరిగింది.
అనుబంధం లింక్ కోసం క్లిక్‌చేయండి.
(Release ID: 1628230)
Visitor Counter : 471
Read this release in:
Punjabi
,
Assamese
,
English
,
Hindi
,
Tamil
,
Malayalam
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Kannada