ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూ డెవలప్ మెంట్ బాంక్ ప్రత్యేక గవర్నర్ల బోర్డ్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
27 MAY 2020 5:55PM by PIB Hyderabad
న్యూ డెవలప్ మెంట్ బాంక్ ( ఎన్ డి బి ) ప్రత్యేక గవర్నర్ల బోర్డు సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఎన్ డి బి కి తరువాత అధ్యక్షుణ్ణి ఎన్నుకోవటం, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రిస్క్ ఆఫీసర్ నియామకం, సభ్యత్వ విస్తరణ వంటివి అజెండాలో ఉన్నాయి.
ఆర్థిక మంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో ఎన్ డి బి పాత్రను ప్రశంసించారు. అది భారత్ సహా సభ్య దేశాల అభివృద్ధి ఎజెండా మీద సానుకూల ప్రభావం చూపిందన్నారు. సభ్య దేశాలకు చెందిన 166౦ కోట్ల డాలర్ల విలువ చేసే 55 ప్రాజెక్టులను ఎన్ డి బి అతి స్వల్ప కాలంలోనే ఆమోదించగలిగిందని, ఇది చెప్పుకోదగిన విషయమని అన్నారు. తోటి ఎం డి బి లతో భుజం భుజం కలిపి పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలిగిందను కూడా శ్రీమతి సీతారామన్ ప్రస్తావించారు.
పదవీకాలం పూర్తి చేసుకున్న ఎన్డీబీ ప్రెసిడెంట్ శ్రీ కెవి కామత్ సేవలను మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. 2014 లో బ్రిక్స్ నాయకులు వెల్లడించిన విజన్ కు ఒక రూపమిచ్చి చాలా వేగంగా ఆచరణలో పెట్టటం ఆయన ఆధ్వర్యంలో సాగినదేనని గుర్తు చేశారు. కోవిడ్-19 కు చురుగ్గా స్పందిస్తూ కోవిడ్-19 అత్యవసర ఋణ పథకం రూపొందించినందుకు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు.
అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన బ్రెజిల్ దేశస్తుడుశ్రీ బ్మార్కోస్ ట్రొయ్ జో ను ఆర్థికమంత్రి అభినందించారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గా, చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా కొత్తగా నియమితుడైన భారతీయుడు శ్రీ అనిక్ కిశోరాను కూడా అభినందించారు. కొత్త నాయకత్వం మీద తనకెంతో నమ్మకముందని, ఎన్దీబీని మరింత వేగంగా ముందుకు నడిపించటంలో వాళ్ళ సారధ్యంలో ఎంతగానో కృషి జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. సభ్యులకు ఋణాలివ్వటంలోను, పారదర్శకతలోను, అంతర్గత విశ్వసనీయతలోను, సమర్థమైన లక్ష్య సాధనలోను ఎన్దీబీ తన బాధ్యత నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ విలువల పరిరక్షణ, ఎన్డీబీని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థగా తీర్చిదిద్దటమనే జంట లక్ష్యాల సాధనే పరమావధిగా ఉండాలని ఆమె సూచించారు.
(Release ID: 1627269)
Visitor Counter : 331