ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మీద తాజా సమాచారం

కోలుకుంటున్నవారు శాతం 42.4 శాతానికి పెరుగుదల

Posted On: 27 MAY 2020 5:03PM by PIB Hyderabad

ముందస్తు జాగ్రత్తలతో  ఆచితూచి అడుగేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి కోవిడ్ -19 నివారణకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న  సానుకూల వైఖరి,  సత్ఫలితాలనిస్తోంది. ఈ చర్యలను ఎప్పటికప్పుడు అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం సమీక్షిస్తోంది.

లాక్ డౌన్ వలన అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి వేగం బాగా తగ్గింది. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం, పెద్ద సంఖ్యలో మరణాలు, బాధితుల సంఖ్యను నివారించగలిగినట్టయింది. అదే విధంగా లాక్ డౌన్ కాలంలో కోవిడ్ -19 కు సంబంధించిన మౌలిక సదుపాయాలు బాగా పెంచుకోవటం, ఆన్ లైన్ శిక్షణ, వెబినార్ ల ద్వారా మానవ వనరుల సామర్థ్యం పెంచుకోవటం  సాధ్యమైంది.  పరీక్షల సామర్థ్యం పెంపు, పరికరాల పెంపు, ఆక్సిజెన్ సమకూర్చటం, సంబంధిత మార్గదర్శకాల జారీ, ప్రమాణాల రూపకల్పన, వాటి పంపిణీ, అమలు, వ్యాధి నిర్థారణ పరీక్షల మెరుగుదల, ఔషధాల పరీక్షలు, వాక్సిన్ పరీఖ్శలు జరిగాయి. సాంకేతిక పరంగా నిఘా వ్యవస్థలు బలోపేతమయ్యాయి. వ్యాధి సోకినవారి ఆచూకీ గుర్తింపు, ఇంటింటికీ సర్వే, ఆరోగ్య సేతు లాంటి యాప్ లాంటివి సాధించగలిగాం.

కోవిడ్ -19  లాక్ డౌన్ కాలంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచుకోవటం సాధ్యమైంది. 2020 మే 27 నాటికి ప్రత్యేకంగా  కోవిడ్ - 19 చికిత్స కోసమే పరిమితమైన ఆస్పత్రులు 930 ఉండగా వాటిలో ఐసోలేషన్ పడకలు 1,58,747, ఐసియు పడకలు 20,355 . ఆక్సిజెన్ అందుబాటులో ఉన్న పడకలు 69,076 ఉన్నాయి. అదే విధంగా కోవిడ్ -19  కోసం 2,362 ఆస్పత్రులను కేటాయించగా వాటిలో ఐసోలేషన్ పడకలు 1,32,593, ఐసియు పడకలు 10,903, ఆక్సిజెన్ అందుబాటులో ఉన్న పడకలు 45,562 అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ మీద పోరాటానికి వీలుగా మొత్తం 10,341 క్వారంటైన్ సెంటర్లు, 7,195 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా వాటిలో ప్రస్తుతం 6,52,830 పడకలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 113.58 లక్షల ఎన్95 మాస్కులు, 89.84 లక్షల వ్యక్తిగత రక్షణ కిట్లు కేంద్రం అందజేసింది. దేశంలో 435 ప్రభుత్వ లేబరేటరీలు,  189 ప్రైవేటు లేబరేటరీల ద్వారా వ్యాధి నిర్థారణ సామర్థ్యం పెరిగింది. 


మొత్తం ఇప్పటిదాకా 32,42,160 శాంపిల్స్ కు కోవిడ్ -19   పరీక్షలు జరిగాయి.అందులో  నిన్న ఒక్కరోజు జరిగిన పరీక్షలు1,16,041

దేశవ్యాప్తంగా మొత్తం 1,51,767 కేసులు నమోదు కాగా వాటిలో 64,426 మంది కోలుకున్నారు. ఆ విధంగా కోలుకున్నవారు 42.4% శాతంగా నమోదయ్యారు. మరణాల శాతం ప్రపంచవ్యాప్తంగా 6.36%  శాతం ఉండగా భారత్ లో మరణాలు  2.86%

పునరుత్పత్తి, గర్భధారణ. శిశు జననం, బాలలు, కౌమార డశలోని వారి ఆరోగ్యం, పోషకాహారం సంబంధిత అంశాలమీద కోవిడ్ -19   సమయంలోని, అనంతరం కూడా సేవల అందుబాటు మీద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వివరాలను
https://www.mohfw.gov.in/pdf/GuidanceNoteonProvisionofessentialRMNCAHNServices24052020.pdf లో చూడవచ్చు

అదే విధంగా కళ్ళకు రక్షణ కల్పించే కళ్ళజోళ్ళను తిరిగి వాడటం మీద సూచనలను కూడా జారీ చేసింది. ఆ వివరాలను
https://www.mohfw.gov.in/pdf/Advisoryonreprocessingandreuseofeyeprotectiongoggles.pdf లో చూడవచ్చు.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవఇనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.



(Release ID: 1627267) Visitor Counter : 264