రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తో వ్యవహరించడానికి, సి.ఐ.పి.ఈ.టి. ఆరోగ్య సంరక్షణ రంగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనుంది; డబ్ల్యు.హెచ్.ఓ./ఐ.ఎస్.ఓ. మార్గదర్శకాల ప్రకారం పి.పి.ఈ. మరియు ఇతర సంబంధిత ఉత్పత్తుల తయారీ మరియు ధృవీకరణ.
మురుతల్, జైపూర్, మధురై మరియు లక్నోలోని సి.ఐ.పి.ఈ.టి. కేంద్రాలు 'కరోనావైరస్'కు వ్యతిరేకంగా పోరాడటానికి రక్షణ కవచంగా ఫేస్ షీల్డ్‌ను అభివృద్ధి చేశాయి.
Posted On:
27 MAY 2020 1:37PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి తో వ్యవహరించడానికి వీలుగా, భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కింద, ఒక ప్రధాన జాతీయ సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సి.ఐ.పి.ఈ.టి.) డబ్ల్యూ.హెచ్.ఓ./ఐ.ఎస్.ఓ. మార్గదర్శకాల ప్రకారం పి.పి.ఇ. మరియు ఇతర సంబంధిత ఉత్పత్తుల తయారీ మరియు ధృవీకరించడం వంటి ఆరోగ్య సంరక్షణ రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలను చేపట్టింది.
క్యాబినెట్ సచివాలయం ఆదేశాల మేరకు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఆర్ & డి కార్యక్రమాలను చేపట్టాలని సి.ఐ.పి.ఈ.టి. ని కోరినట్లు, సి.ఐ.పి.ఈ.టి. పేర్కొంది. తదనుగుణంగా, ఐ.ఎస్.ఓ./డబ్ల్యూ.హెచ్.ఓ. మార్గదర్శకాల ప్రకారం మరియు పరీక్షలు మరియు ప్రమాణాల ప్రయోగశాల జాతీయ ధ్రువీకరణ బోర్డు (ఎం.ఏ.బి.ఎల్.) ధ్రువీకరణ కోసం భువనేశ్వర్, చెన్నై, లక్నో లలో సి.ఐ.పి.ఈ.టి. చెందిన మూడు ప్లాస్టిక్ సాంకేతిక కేంద్రాలు (ఐ.పి.టి.లు) త్వరలో సిద్ధం కానున్నాయి.
సి.ఐ.పి.ఈ.టి. : ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, కార్మికులు, పోలీసు సిబ్బంది మొదలైన వారు 'కరోనావైరస్'కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన రక్షణ పరికరం - 'ఫేస్ షీల్డ్' ను మూర్తల్ లోని నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక మద్దతు కేంద్రం (సి.ఎస్.టి.ఎస్.) అభివృద్ధి చేసింది.
జైపూర్ లోని సి.ఐ.పి.ఈ.టి. : సి.ఎస్.టి.ఎస్., లక్నో లోని సి.ఐ.పి.ఈ.టి. : ఐ.పి.టి., మరియు మధురై లోని సి.ఐ.పి.ఈ.టి. :సి.ఎస్.టి.ఎస్. సంస్థలు ఫేస్ షీల్డ్ ను అభివృద్ధి చేశాయి. ఫ్రేముల ఉత్పత్తి కొనసాగుతోంది.
పరిపాలనా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అవసరమైన సేవలకు తోడ్పడటానికి ఆహార ధాన్యం ప్యాకేజింగ్‌ను పరీక్షించే సామర్థ్యాన్ని సి.ఐ.పి.ఈ.టి. విస్తరించింది.
అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తొమ్మిది మంది సభ్యుల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా సాంకేతిక సహాయాన్ని అందించడానికి వీలుగా పరిశ్రమకు ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలు మరియు పరిశ్రమ వద్దకే సేవలను అందించే కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా, సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ, కనీస సిబ్బందితో మూడు షిఫ్ట్ ల ప్రాతిపదికన నడపాలని ప్రతిపాదించడం జరిగింది.
కోవిడ్-19 మహమ్మారి యొక్క దుస్థితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రధానమంత్రి కెర్స్ నిధికి మరియు స్థానిక సంస్థ / మునిసిపల్ కార్పొరేషన్ / రాష్ట్ర ప్రభుత్వ అధికార సంస్థలకు సహకరించడం ద్వారా సి.ఐ.పి.ఈ.టి. సమాజ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు నిచ్చింది. సి.ఐ.పి.ఈ.టి. లోని ఉద్యోగులందరూ కలిసి ఒక రోజు జీతం, సుమారు 18.25 లక్షల రూపాయలను ప్రధానమంత్రి కెర్స్ నిధికి విరాళంగా అందజేశారు.
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో, భారత ప్రభుత్వం అమలుచేసిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం మరియు ఆశ్రయం కల్పించడం ద్వారా బాధితులు మరియు వలస కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితిని తగ్గించడానికి, సంబంధిత అధికారుల అనుమతితో సి.ఐ.పి.ఈ.టి. ఇంత వరకు వివిధ స్థానిక సంస్థలు / మునిసిపల్ కార్పొరేషన్లు / రాష్ట్ర ప్రభుత్వానికి 85.50 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది.
****
(Release ID: 1627193)
Visitor Counter : 273
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam