రాష్ట్రపతి సచివాలయం
భారత రాష్ట్రపతి ఈద్-ఉల్- ఫితర్ శుభాకాంక్షలు
Posted On:
24 MAY 2020 5:42PM by PIB Hyderabad
ఈద్-ఉల్- ఫితర్ సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ భారత పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు, ప్రార్థనల నేపథ్యంలో వచ్చే ఈద్-ఉల్- ఫితర్ ప్రవాసులతో సహా భారతీయులందరికీ రాష్ట్రపతి తన సందేశంలో శుభాకాంక్షలు , శుభాభినందనలు తెలియజేశారు. ప్రేమ, శాంతి, సౌబ్రాతృత్వం, సామరస్యం తెలియజెప్పటమే ఈ పండుగ లక్ష్యమన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలను ఆదుకోవటంలో మనకున్న నమ్మకాన్ని ఈ సందర్భంగా మరోమారు చాటుకోవాలన్నారు.
కోవిడ్-19 లాంటి కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఇలాంటి సమయంలో ఇవ్వటం (జమాత్) అనే స్ఫూర్తిని మరింతగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరం పాటించటం సహా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సవాలును త్వరగా అధిగమించటానికి పాటుపడతామనే ప్రతిజ్ఞ తీసుకోవాలని ఈ సంసర్భంగా సూచించారు.
ఈ ఈద్-ఉల్- ఫితర్ ప్రపంచంమంతటా దయ, జాలి, నమ్మకం లాంటి విశ్వజనీన విలువలు పాదుకొల్పాలని రాష్ట్రపతి అభిలషించారు.
రాష్ట్రపతి హిందీ సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1626645)
Visitor Counter : 211