ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్ డేట్స్
Posted On:
24 MAY 2020 4:46PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ,కోవిడ్ -19 నియంత్రణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో పలు ముందస్తు, సానుకూల చర్యలు చేపడుతోంది. ఈ చర్యలను ఉన్నత స్ధాయిలో క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఈరోజు ఢిల్లీలోని చౌదరి బ్రహ్మ ప్రకాశ్ ఆయుర్వేద్ చరక్ సంస్థాన్‌ను సందర్శించారు. ఇది కోవిడ్ -19 కేసులకు సంబంధించి ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రంగా (డిసిహెచ్‌సి) ఇది పనిచేస్తోంది. కోవిడ్ -19 కేసులకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ తీరును ఈ సందర్భంగా మంత్రి అక్కడ పరిశీలించారు. కోవిడ్ -19 పేషెంట్లకు అక్కడ అందుతున్న చికిత్సను ఆయన స్వయంగా చూసి తెలుసుకున్నారు. వివిధ వార్డులలో సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనల మేరకు హోలిస్టిక్ విధానంలో వీరికి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం, తేలిక పాటి కేసులు గా గుర్తించిన వాటికి సంబంధించిన చికిత్స అందించే ఆస్పత్రులు కోవిడ్ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు . ఇవి పూర్తి స్థాయి ఆస్పత్రులుగానో లేదా ఆస్పత్రిలో ఒక బ్లాక్‌ను ప్రత్యేకంగా దీనికి కేటాయించి, విడిగా రాక,పోకలకు మార్గం కల్పించడం ద్వారా ఏర్పాటు చేస్తారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అంతర్జాతీయ ప్రయాణికులరాకకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన వివరాలు కింద పరిశీలించవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/Guidelinesforinternationalarrivals.pdf
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, దేశీయ ప్రయాణానికి సంబంధించి ( విమానయానం, రైలు, అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులకు) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. వీటి వివరాలను కింద గమనించవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/Guidelinesfordomestictravel(airortrainorinter-statebustravel).pdf
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 54,440 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో 2657 మంది పేషెంట్లకు వ్యాధి నయమైంది. దీనితో రికవరీ రేటు 41.28 శాతానికి పెరిగింది.
నిన్నటి నుంచి మన దేశంలో 6767 కోవిడ్ -19 నిర్దారణ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కోవిడ్ నిర్ధారణ కేసుల సంఖ్య 1,31,868 కి చేరింది. చికిత్సపొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 73,560
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1626628)
Visitor Counter : 285
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam